Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు, సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండటంతో ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట..!

These Scenes To Be Highlight In Chiranjeevi Waltair Veerayya Movie

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు
ప్రేక్షకులు, సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండటంతో ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

Waltair Veerayya: బాస్ పార్టీ నుంచి మరో ట్రీట్ రానుందా..?

ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘బాస్ పార్టీ’ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్స్‌కు.. చిరు గ్రేస్ స్టెప్స్ తోడవడంతో ఈ పాటను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో ఈ పాట దుమ్ములేపుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా చిరంజీవి-రవితేజల మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..

ఈ సినిమాలో రవితేజ చిరుకి సవతితల్లి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. వారిద్దరికి అస్సలు పడదట. అయితే వారిమధ్య వచ్చే ఎత్తుకు పైఎత్తు సీన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ఇక వారు చేసే యాక్షన్ సీక్వెన్స్‌లను వెండితెరపై వీక్షించాల్సిందేనట. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’పై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు చేస్తున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో చిరు-రవితేజలు కలిసి ఓ పాటలో స్టెప్స్ వేస్తున్నారట. త్వరలోనే ఈ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.