The Warrior : శింబు పాటకి.. రామ్, కృతిశెట్టి బుల్లెట్ స్టెప్పులు..

తమిళ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ ని పాడారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శింబు తమిళ్, తెలుగు భాషల్లో ఈ పాట పాడినట్టు...........

The Warrior : శింబు పాటకి.. రామ్, కృతిశెట్టి బుల్లెట్ స్టెప్పులు..

Rapo

Bullet Song :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. దాని తర్వాత తెలుగు తమిళ్ భాషల్లో ”ది వారియర్” అనే సినిమాని చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రామ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘ది వారియర్’ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ మొట్టమొదటి సారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ గా చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. తమిళ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ ని పాడారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శింబు తమిళ్, తెలుగు భాషల్లో ఈ పాట పాడినట్టు, దేవిశ్రీ ప్రసాద్ పాడించినట్టు మేకింగ్ వీడియోతో పాటు, ఈ పాటకి రామ్, కృతిశెట్టి కలిసి స్టెప్పులు వేసినట్టు చూపించారు. గతంలో కూడా శింబు తెలుగులో కొన్ని పాటలని పాడారు. తాజాగా రామ్ కోసం ‘ది వారియర్’ సినిమాలో ఈ బుల్లెట్ సాంగ్ ని పాడారు. ఈ పాట\ పూర్తి లిరికల్ వీడియోని ఏప్రిల్ 22న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు.

Kamal Khan : బాహుబలిని మించిన సినిమా తీస్తాను

ఇక ఇప్పటికే బంగార్రాజు సినిమాలో ఓ సాంగ్ కి కృతి శెట్టి మాస్ బీట్ స్టెప్పులు వేసి అలరించింది. ఇప్పుడు ఈ బుల్లెట్ సాంగ్ లో రామ్ తో కలిసి మరోసారి అదిరిపోయే డ్యాన్స్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనే రెండు స్టెప్పులు చూపించారు. ఇక పాట మొత్తం కృతి ఎన్ని స్టెప్స్ వేసి అదరగొట్టిందో అంటూ కృతి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ ఎనర్జీ కి మ్యాచ్ అయ్యేలా కృతి ఇందులో కచ్చితంగా సూపర్ డ్యాన్స్ వేస్తుందని అభిప్రాయపడుతున్నారు.