Cable Car: గాలిలో నిలిచిపోయిన కేబుల్ కారు.. యాత్రికుల్ని కాపాడుతున్న భద్రతా సిబ్బంది

మరోవైపు ప్రయాణికుల్ని కాపాడేందుకు పోలీసులు, కేబుల్ కార్ నిర్వాహకులు, జాతీయ విపత్తు నిర్వహణా దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తోంది. జిల్లా ఎస్పీ వరీందర్ శర్మ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

Cable Car: గాలిలో నిలిచిపోయిన కేబుల్ కారు.. యాత్రికుల్ని కాపాడుతున్న భద్రతా సిబ్బంది

Cable Car

Cable Car: హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వానూ టింబర్ ట్రయల్ పరిధిలో కేబుల్ కార్ నిలిచిపోవడంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. కేబుల్ కారు ప్రయాణిస్తుండగా, సాంకేతిక సమస్యతో గాలిలోనే నిలిచిపోయింది. దీంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

మరోవైపు ప్రయాణికుల్ని కాపాడేందుకు పోలీసులు, కేబుల్ కార్ నిర్వాహకులు, జాతీయ విపత్తు నిర్వహణా దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తోంది. జిల్లా ఎస్పీ వరీందర్ శర్మ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కారులో చిక్కుకున్న వాళ్లంతా ఢిల్లీకి చెందిన యాత్రికులు. ఇప్పటివరకు కారులో చిక్కుకున్న 11 మందిని భద్రతా సిబ్బంది సురక్షితంగా రక్షించారు. కారు వద్దకు మరో ట్రాలీని పంపించి ప్రయాణికుల్ని రక్షించే చర్యలు చేపడతున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్‌లో జరిగిన కేబుల్ ప్రమాద ఘటన మరువక ముందే తాజా ఘటన జరగడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే, భద్రతా సిబ్బంది చొరవతో ప్రయాణికుల్ని క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Presidential race: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!

గత ఏప్రిల్‌లో ఝార్ఖండ్‌లోని దియోగర్ జిల్లాలో జరిగిన కేబుల్ ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. 1992 అక్టోబర్‌లో కూడా ఇలాగే కేబుల్ కారు ప్రమాదానికి గురైతే, అప్పట్లో ఇండియన్ ఆర్మీ, నేవీ కలిపి కారులో చిక్కుకున్న 11 మందిని సురక్షితంగా కాపాడారు. ఈ సమయంలో 11 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల సాయంతో రక్షించారు.