Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ అవినీతికి అవధులు లేవన్నారు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు.

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి : రేవంత్ రెడ్డి

Revanth (2)

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణినీ ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నామనేది డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 2004 నాటి స్వర్ణమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. రైతులకు మళ్ళీ అన్నిరకాల సబ్సిడీలు అందిస్తామని చెప్పారు. వరంగల్ సభకు రాష్ట్రంలో రైతులు కుటుంబానికి ఒక్కరు చొప్పున తరలి రావాలని పిలుపిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేయబోతున్న యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్ ఎన్ రోలర్ తొమ్మిది మందిని తీసుకురావాలన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.

Revanth Reddy: రైతులు, విద్యార్థులే తెలంగాణకు యజమానులు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ అవినీతికి అవధులు లేవన్నారు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందని ఆరోపించారు. యాదగిరి నరసింహ స్వామి కూడా కేసీఆర్ కుటుంబానికి బలైపోయారని పేర్కొన్నారు. అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు. 62 కోట్లతో మొదలు పెట్టిన స్థూపం.. రెండు వందల కోట్లు చెల్లించినా పుర్తి కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం వారసుల సంపదను మించిపోయిందని పేర్కొన్నారు.