Traffic Challans : పెండింగ్ చలాన్లకు ఫుల్ రెస్పాండ్..3 రోజుల్లో రూ. 39 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానా

Traffic Challans : పెండింగ్ చలాన్లకు ఫుల్ రెస్పాండ్..3 రోజుల్లో రూ. 39 కోట్లు

Traffic Challans

Traffic Challans Collection : పెండింగ్ చలాన్లకు భారీ స్పందన వస్తోంది. తమ తమ వాహనాలపై ఉన్న చలాన్లు వెంటనే కట్టేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన జరిమానాల రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 39 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మార్చి 01 నుంచి పెండింగ్ చలానాలు చెల్లించేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్, ఈ చలాన్ ల వెబ్ సైట్ లోకి వెళ్లి చలానాలను కట్టేస్తున్నారు. చాలా మంది రావడంతో వెబ్ సైట్ ఆగిపోతోంది. ఒక సెకన్ కు గరిష్టంగా 45 వేల హిట్లు వచ్చాయని, నిమిషానికి 700 చలాన్లను చెల్లింపులు చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. మార్చి 01వ తేదీన 8 లక్షలు, మార్చి 02వ తేదీన 15 లక్షలు, మార్చి 03న 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Read More : Hyderabad Traffic : 8 గంటల్లో లక్షా 77 వేల చలాన్లు క్లియర్..

రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లను విధిస్తారనే సంగతి తెలిసిందే. కొంతమంది వీటిని చెల్లిస్తుండగా మరికొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. దీంతో చలాన్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చలాన్లపై రాయితీ ప్రకటించారు. చలాన్లను చెల్లించకపోతే మళ్లీ రాయితీలు ఇవ్వరనే ఉద్దేశ్యంతో భారీగా వాహనదారులు వాటిని కట్టేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ… నిబంధనల్లు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రహదారులపై సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనదారులు సహకరించాలని సూచించారు.

Read More : నిమిషానికి 700పెండింగ్ చలాన్లు క్లియర్

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. ద్విచక్రవాహనదారులు 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్ లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్ లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్‌ (https://echallan.tspolice.gov.in/publicview) లోనే పెండింగ్‌ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది.