TRS MPs : పార్లమెంట్‌‌లో టీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి పీయూష్‌‌పై ప్రివిలేజ్ నోటీసు

పారా బాయిల్డ్ రైస్‌ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...

TRS MPs : పార్లమెంట్‌‌లో టీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి పీయూష్‌‌పై ప్రివిలేజ్ నోటీసు

Trs Mp

Privilege Notice On Minister Piyush : కేంద్రం, టీఆర్ఎస్ మధ్యం ధాన్యం దంగల్‌ ముదురుతోంది. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొని తీరాల్సిందేనంటూ డిమాండ్‌ చేస్తోంది కారు పార్టీ. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధానికి సై అంటే సై అంటున్న టీఆర్ఎస్‌.. బీజేపీపై దాడిని మరింత ఉధృతం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. వీలు చిక్కినప్పుడల్లా.. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. తాజాగా.. కేంద్రమంత్రి పియూల్‌ గోయల్‌పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. సభను తప్పుదోవ పట్టించారంటూ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు.

Read More : TRS Party : ధాన్యం దంగల్.. ఇక సమరమే అంటున్న గులాబీ దళం

పారా బాయిల్డ్ రైస్‌ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై రాజ్యసభ టీఆర్‌ఎస్‌ డిప్యూటీ లీడర్ సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ తీర్మానాన్ని అందజేశారు. సభలో రైతులకు వ్యతిరేకంగా ప్రకటన చేశారంటూ.. ఉభయ సభల్లో కేంద్ర మంత్రిపై అవిశ్వాసం ప్రకటించారు ఎంపీలు. ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పారాబాయిల్డ్ రైస్ ఎగుమతుల అంశంపై సభను తప్పుదోవ పట్టించే సమాధానం చెప్పారంటూ ఆరోపిస్తున్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. భారత ప్రభుత్వం వెబ్‌సైట్స్ ప్రకారం.. అనేక దేశాలకు పారా బాయిల్డ్ రైస్‌ ఎగుమతులు చేస్తున్నారంటూ నోటీసులు పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎంపీలు.

Read More : CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్.. చివరి ప్రయత్నంగా కేంద్రంతో చర్చలు, విఫలమైతే

మరోవైపు.. దాన్యం కొనుగోళ్లపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 11 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.ఓ వైపు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తూనే.. ఢిల్లీలో పార్లమెంట్‌ లోపల, బయట ఆందోళనలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ. ఈనెల 6న నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధం, ఏప్రిల్ 7న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది టీఆర్‌ఎస్‌. ఏప్రిల్ 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.