TTD : మూడు నెలల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్

సోమవారం ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసింది.. టీటీడీ. ఇక మే నెల కోటాను మంగళవారం, 23న జూన్‌ నెల కోటాను..

TTD : మూడు నెలల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్

Ttd (1)

Darshan Tickets For Three Months : మూడు నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను.. అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ 2022, మార్చి 21వ తేదీ సోమవారం విడుదల చేసింది. 3వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను.. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఉంచనుంది.

Read More : TTD Tickets Online: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్ టికెట్లు విడుదల!

సోమవారం ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసింది.. టీటీడీ. ఇక మే నెల కోటాను మంగళవారం, 23న జూన్‌ నెల కోటాను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు 30వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25వేల టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచనుంది టీటీడీ. ఇక నెలకు 7లక్షల 60వేల టిక్కెట్ల చప్పున .. మొత్తం మూడు నెలలకు.. 21లక్షల 60వేల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

Read More : TTD : తిరుమల కిటకిట.. వీకెండ్ రష్

ఇక.. సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో .. తిరుమలలోని భూదేవి కంప్లెక్స్‌, శ్రీనివాస కంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో.. భక్తులకు అందించనున్నారు టీటీడీ అధికారులు. భక్తుల రద్దీకి అనుగుణంగా టైంస్లాట్‌ విధానంలో ఈ టికెట్లను అందజేయనున్నారు. కొండపై ప్రస్తుతానికి వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో .. భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేవలం టికెట్లు ఉన్నవారినే తిరుమలకు అనుమతిస్తున్నారు అధికారులు. ఇక.. దర్శనం టికెట్లు లేని భక్తులను .. కొండపైకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది టీటీడీ.