Amit Shah : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. తెలంగాణకు రానున్న అమిత్ షా

ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.

Amit Shah : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. తెలంగాణకు రానున్న అమిత్ షా

Amit Shah

Amit Shah : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణను టార్గెట్ చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.

ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా ప్రసంగంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ పర్యటనకు ముందు ఢిల్లీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు, RRR టీమ్‌తో భేటీ రద్దు

కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో‌ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో‌ పార్లమెంట్ ప్రావాస్ యోజలో భాగంగా జరుగుతోన్న చేవెళ్ల విజయసంకల్ప సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటించారు. 15రోజుల గ్యాప్ లోనే తెలంగాణలో మోదీ, అమిత్ షా పర్యటిస్తున్నారు.

ప్రధానమంత్రి మోదీ అధికారిక కార్యక్రమంలో సైతం బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో చేవెళ్ల విజయసంకల్ప సభలో అమిత్ షా స్పీచ్ పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో అధికారక కార్యక్రమాల నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ కు గంటన్నర ఆలస్యంగా రానున్నారు. దీంతో RRR టీం, బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం రద్దు అయింది.

Karnataka Polls: సిట్టింగులను ఎత్తేసిన బీజేపీ.. అమిత్ షా సమాధానం ఏంటంటే?

శంషాబాద్ విమానాశ్రయం నుండి అమిత్ షా నేరుగా సభ ప్రాంగణనానికి చేరుకోనున్నారు. సాయంత్రం 6గం నుంచి 7గంల వరకు గంట పాటు చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి ఉండనున్నారు. రోడ్డు మార్గాన రాత్రి 7.45కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాత్రి 7.50గంలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.