UP Election : ఈవీఎంలపై ఆరోపణలు, వారణాసి అధికారి సస్పెండ్

ట్యాంపరింగ్ లకు పాల్పడుతున్నారని చేసిన ఆరోపణలను సీఈసీ ఖండించింది. వారణాసి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ADM) ఎన్.కే సింగ్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.

UP Election : ఈవీఎంలపై ఆరోపణలు, వారణాసి అధికారి సస్పెండ్

Up Election (1)

EC Suspends Varanasi Officer : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2022, మార్చి 10వ తేదీన వెల్లడికానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటే.. నేతల ఆరోపణలు హీట్ పుట్టిస్తున్నాయి. వారణాసిలో ఈవీఎంల తరలింపు హాట్ టాపిక్ అయ్యింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం కలకలం రేపాయి. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఓటింగ్ మిషన్లు దొంగిలించబడుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేశారు. ట్యాంపరింగ్ లకు పాల్పడుతున్నారని చేసిన ఆరోపణలను సీఈసీ ఖండించింది. వారణాసి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ADM) ఎన్.కే సింగ్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.

Read More : UP : స్ట్రాంగ్ రూం వద్ద బైనాక్యులర్‌‌తో ఎస్పీ అభ్యర్థి నిఘా.. 24 గంటల పాటు భద్రత

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్రభూషణ్ మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ లను ఉల్లంఘించిన వారిపై ECI కఠినమైన చర్యలు తీసుకుందని, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఈవోను ఆదేశించడం జరిగిందన్నారు. వారణాసి ECI ADMను సస్పెండ్ చేయడం జరిగిందని, పటిష్టమైన భద్రత మధ్య ఈవీఎంలున్నాయన్నారు. 130 మంది పోలీసుల పరిశీలకులు, 10 మంది ప్రత్యేక పరిశీలకులుగా నియమించినట్లు వెల్లడించారు. మూడంచెల భద్రత కల్పించినట్లు.. 24 గంటల పాటు సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.

Read More : Five States Election : రేపే ఎన్నికల ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ, విజేతలు ఎవరో ?

ఈవీఎంల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించినందుకు వారణాసి ADMపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం.. యూపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను ఆదేశించింది. ఈవీఎంలకు సంబంధించి కొన్ని పుకార్లు వ్యాపించాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఈవోను ఆదేశించడం జరిగిందని ECI తెలిపింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి స్ట్రాంగ్ రూమ్ ల నుంచి ఈవీఎంలు దొంగిలించబడుతున్నాయని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేసిన తర్వాత ఈసీ చర్యలు చేపట్టింది. తరలించిన ఈవీఎంలు ఓటింగ్ కు సంబంధించినవి కావని ఈసీ స్పష్టం చేసింది.