Assembly Elections: ఉత్తరప్రదేశ్ రెండో దశ, గోవాలో మొదటి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం

యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Assembly Elections: ఉత్తరప్రదేశ్ రెండో దశ, గోవాలో మొదటి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం

Elections

Assembly Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సహరాన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ మరియు షాజహాన్‌పూర్ జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. కాగా రేపు ఎన్నికలు జరుగనున్న స్థానాల్లో గతంలో (2017లో) 38 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, 15 స్థానాల్లో సమాజ్ వాది, 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

Also read: Srilanka: “వీసా ఆన్ ఎరైవల్”ను పునఃప్రారంభించిన శ్రీలంక, పాకిస్తాన్ కి మాత్రం లేదు

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో అత్యధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఎస్పీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులకు ఇక్కడ పలుకుబడి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తుండగా..వోటింగ్ సమయానికి అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇక్కడి గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు..మొదటి విడత ఎన్నికల సమయంలో జరిగిన పొరబాట్లను దృష్టిలో ఉంచుకుని.. సోమవారం జరగనున్న ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.

Also read: IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్

ఇక సోమవారం నాడే గోవా రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో మొత్తం 40 స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. మొత్తం 40 నియోజకవర్గాల్లో 301 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ గత ఎన్నికల్లో పోటాపోటీగా సీట్లు గెలుచుకోగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. మరో వైపు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం గోవాలో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also read: Career Websites: ఉద్యోగాల కోసం ఈ టాప్ 10 వెబ్‌సైట్లను చూడండి