CharDham Yatra: ఛార్‌ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది

కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్‌ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్‌ధామ్ అంటారు అనే సంగతి తెలిసిందే.

CharDham Yatra: ఛార్‌ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది

Chardham Yatra

CharDham Yatra: ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మంది భక్తులు ఛార్‌ధామ్ యత్ర పూర్తి చేసుకున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ చెప్పింది. కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి 19,04,253 మంది ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ చేరుకున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్‌ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్‌ధామ్ అంటారు అనే సంగతి తెలిసిందే.

National Herald Case: ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

ఈ ఏడాది ఒక రోజులో ఛార్‌ధామ్ దర్శించుకునే భక్తుల సంఖ్యను పెంచాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పుణ్యక్షేత్రానికి వెయ్యి మంది భక్తులను అదనంగా అనుమతించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం బద్రినాథ్ పుణ్యక్షేత్రంలో రోజుకు 16,000 మంది, కేదార్ నాథ్ పుణ్యక్షేత్రంలో రోజుకు 13,000 మంది, గంగోత్రిలో రోజుకు 8,000 మంది, యమునోత్రిలో రోజుకు 5,000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చు. రెండేళ్లుగా సరైన దర్శనం లేకపోవడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ యాత్ర కోసం దాదాపు పది లక్షల మంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 26 మంది యాత్రికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.