Toor Dal Farming : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు

ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.

Toor Dal Farming : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు

dal cultivation

Toor Dal Farming : ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడా  కురుస్తున్న తేలికపాటి వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కందిపంటను సాగుచేసే రైతులు జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికచేసుకొని , సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.

READ ALSO : Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

తెలుగురాష్ర్టాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12లక్షల ఎకరాలలో సాగవుతుంది. తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో  సాగవుతంది.  కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది.

ఈపంటలో ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం  కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా..  ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

READ ALSO :Redgram Crop : కందిపంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు !

ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.

సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏయే రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏవిధంగా వున్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్.