Big Boss 5: బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేసిన వర్షిణి, మంగ్లీ.. కారణమేంటో?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాద

Big Boss 5: బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేసిన వర్షిణి, మంగ్లీ.. కారణమేంటో?

Big Boss 5

Big Boss 5: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా త్వరలో సీజన్స్ 5 కూడా ప్రారంభం కానుంది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎవరా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. కింగ్ నాగ్ హోస్ట్ చేయనున్న ఈ సీజన్ ను కూడా సెప్టెంబర్ లో మొదలు పెట్టనున్నారు.

కాగా, ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇందులో యాంకర్ రవి, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, గ్లామర్ యాంకర్ వర్షిణి, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, టీవీ9 ప్రత్యూషల పేర్లు ఉన్నాయి. కాగా, ఇందులో ఫైనల్ లిస్ట్ కంటెస్టెంట్లపై ఇప్పటికే ఏవీ షూట్ కూడా పూర్తిచేయగా హోస్ట్ నాగ్ మీద చేసిన ప్రోమో కూడా విడుదలైంది.

అయితే.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల జాబితాలోని పేర్లలో యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ షోకు వెళ్లడం లేదని తాజా సమాచారం. యాంకర్ వర్షిణి ఇప్పటికే ఓ టీవీ సంస్థతో ఒప్పందం కారణంగా వంద రోజుల పాటు బిగ్ బాస్ కు అగ్రిమెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. మంగ్లీ వరసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సాంగ్స్ తో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో నాలుగు నెలల పాటు అందుబాటులో లేకపోతే కెరీర్ నష్టపోయే అవకాశం కారణంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.