Veera Simha Reddy: ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే హాఫ్ మిలియన్ మార్క్ దిశగా వీరసింహారెడ్డి పరుగులు..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అరాచకం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Veera Simha Reddy: ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే హాఫ్ మిలియన్ మార్క్ దిశగా వీరసింహారెడ్డి పరుగులు..!

Veera Simha Reddy Crosses 400K Dollar Mark At USA Box Office

Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అరాచకం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Veera Simha Reddy: మాస్ మొగుడు లిరికల్ సాంగ్.. శ్రుతితో బాలయ్య ఊరమాస్ రొమాన్స్!

కాగా, ఈ సినిమాలో బాలయ్య ఓ పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోనున్నాడు. అయితే ఈ సినిమాను ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే అక్కడ ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిలీజ్‌కు ముందే, ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ల రూపంలో ఏకంగా 400K డాలర్లు వసూలు చేసినట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌కు చేరువలో ఈ సినిమా ఉండటంతో, ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి ఫిగర్స్ కలెక్ట్ చేస్తుందా అని అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’గా నందమూరి బాలయ్య మనవడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్‌లు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వీరసింహారెడ్డి ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.