Veera Simha Reddy : ‘మాస్ మొగుడి’గా బాలయ్య.. వీరసింహారెడ్డి సాంగ్ అప్డేట్!

నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో, మరోపక్క షోస్‌తో ప్రేక్షకులను బ్రేక్ లేకుండా అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నటసింహం నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయ్యిన సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.

Veera Simha Reddy : ‘మాస్ మొగుడి’గా బాలయ్య.. వీరసింహారెడ్డి సాంగ్ అప్డేట్!

Veera Simha Reddy new song update

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో, మరోపక్క షోస్‌తో ప్రేక్షకులను బ్రేక్ లేకుండా అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నటసింహం నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్‌కు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయ్యిన సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘జై బాలయ్య’ సాంగ్ న్యూ ఇయర్ వేడుకల్లో మోత మోగిపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్. ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ జనవరి 3న రాత్రి గం.7:55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

రిలీజ్ అయ్యిన సాంగ్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్, హనీ రోజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రెజెంట్ డైరెక్టర్ గోపీచంద్, బాలయ్య సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయో? లేదో? చూడాలి.