Vegetable Farming : వేసవిలో కూరగాయల సాగు.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే  3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది.

Vegetable Farming : వేసవిలో కూరగాయల సాగు.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

Vegetable Farming In Summer

Updated On : May 11, 2023 / 9:31 AM IST

Vegetable Farming : వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ , కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, రైతులు.. వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా     ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని సూచిస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే  3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కానీ వేసవిలో అదే కూరగాయలు సాగుచేస్తే, అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం , వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

కాబట్టి  నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం వల్లే, ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !