Vijay Sethupathi : ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి..?

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి భాగం కాబోతున్నట్లు సమాచారం..

Vijay Sethupathi : ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి..?

Vijay Sethupathi

Vijay Sethupathi: జూ.ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పనులతో బిజీగా ఉన్న తారక్.. ఇప్పటివరకు వచ్చిన రెండేళ్ల గ్యాప్‌ను భర్తీ చేస్తూ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా ఉంటుందని అనుకుంటుండగా ఊహించని విధంగా దర్శకుడు కొరటాల శివతో సినిమా ప్రకటన వచ్చేసింది.

కొరటాల సినిమా చివరి దశకు చేరగానే ‘కె.జి.యఫ్’ తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడట. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ సినిమా పూర్తికాగానే తారక్ సినిమా మొదలు కానుందట. ఇప్పటికే ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ మధ్య కథా చర్చలు కూడా జరగగా ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెప్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి భాగం కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ధీటుగా ఉండే పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్నారట. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం.