Varisu : వారసుడు ఓటిటికి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో, ఎక్కడో తెలుసా?

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వరిసు'. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా మూవీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Varisu : వారసుడు ఓటిటికి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో, ఎక్కడో తెలుసా?

varisu ott

Varisu : తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వరిసు’. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’ టైటిల్ తో రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి విజయ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, సంగీత వంటి భారీ తారాగణం పని చేశారు.

Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?

ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీలోని ‘రంజితమే’ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా మూవీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 22న నుంచి ఈ సినిమా ఓటిటిలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరిసు రిలీజ్ కాబోతుంది. థియేటర్ లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఇప్పుడు ఓటిటిలో చూసేయండి.

కాగా విజయ్ తన 67 సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు శరవేగంగా రెడీ చేస్తున్నాడు. గతంలో విజయ్ తో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచేసింది. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష ఈ సినిమాలో నటిస్తుంది. ‘లియో’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.