VRA System : శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు, వారసులకు ప్రభుత్వ ఉద్యోగం.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ.. వారిని నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. VRA System

VRA System : శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు, వారసులకు ప్రభుత్వ ఉద్యోగం.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

VRA System (Photo : Google)

VRA System – CM KCR : తెలంగాణలో వీఆర్ఏ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలుగా పని చేస్తున్న సిబ్బంది రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మంత్రుల సబ్ కమిటీ సిఫార్సులతో నిబంధనలను సంస్కరించి వీఆర్ఏల అర్హత ప్రకారం మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయితీ రాజ్ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.

ఇక, 61ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 61ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 2014 జూన్ 2 తర్వాత విధుల్లో మరణించిన 61ఏళ్లలోపు వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వీఆర్ఏల సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించిన జీవో సోమవారం విడుదల కానుంది.

Also Read..Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

”వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ.. వారిని నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థ రాష్ట్రంలో కనుమరుగు కానుంది. ప్రస్తుత ఉద్యోగులను నాలుగు శాఖల్లో క్రమబద్దీకరిస్తారు. జూన్ 2 2014 తర్వాత విధుల్లో మరణించిన వీఆర్ఏ వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు” అని అధికారులు వెల్లడించారు.