Online Betting : వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్ట్.. రూ.2 కోట్లు స్వాధీనం

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరినీ వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 2.05 కోట్ల నగదు, స్వాధీనం చేసుకున్నారు.

Online Betting : వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్ట్.. రూ.2 కోట్లు స్వాధీనం

Online Betting

Online Betting : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరినీ వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 2.05 కోట్ల నగదు, స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయ్‌లు ఆన్‌లైన్ వేదికగా క్రికెట్ బెట్టింగులు, పేకాట నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి నగదుతోపాటు 43 బ్యాంకు పాసు పుస్తకాలు ఏటీఎం కార్డులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషినర్ తరుణ్ జోషి తెలిపారు.

చదవండి : Online Betting : హుజూరాబాద్ ఉపఎన్నికపై వంద కోట్లకు పైగా బెట్టింగ్

హైదరాబాద్ హఫీజ్‌పేటలో బట్టల వ్యాపారం నిర్వహించే ప్రసాద్‌‌కు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి పుట్టింది. దీంతో అతడు 2016లో క్రికెట్ బెట్టింగ్స్, పేకాట బెట్టింగ్స్ ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ క్రమంలోనే ముంబై కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్న అభయ్ అనే వ్యక్తితో ప్రసాద్‌కి పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలను విస్తరించారు. పెట్టింగ్ పెట్టిన వారిని ముందు గెలిపించి వారికి డబ్బుపై ఆశ కలిగిస్తారు. ఆట ఆడితే డబ్బు వస్తుందని నమ్మకం తెప్పిస్తారు.

చదవండి : Online Cricket Betting : ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

పెద్ద మొత్తంలో డబ్బు బెట్టింగ్ వేయించి ఓడిపోయేలా చేస్తారు. ఆన్ లైన్ పేకాట ఆడుతున్న సమయంలోనే బ్యాక్ ఎండ్ కోడ్ మర్చి వారు గెలిచే ముక్కలు కాకుండా వేరేవి వచ్చేలా చూసి ఓడిస్తారు. ఇలా అనేక మందిని మోసం చేశారు ఇరువురు. ఆన్ లైన్ పేకాటపై పోలీసులకు సమాచారం రావడంతో నిఘాపెట్టి పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.2.05 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.