80 Year Old Woman Race : బామ్మా.. నువ్వు సూపరహె.. 80ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్న వృద్ధురాలు.. 100 మీటర్ల రేస్ 49సెకన్లలోనే పూర్తి

ఉత్తరప్రదేశ్‌కి చెందిన 80ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఔరా అనాల్సిందే. పండు ముసలి వయసులోనూ లేడి పిల్లలా పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటింది. 100 మీటర్ల రేస్ ని 49 సెకన్లలోనే ఫినిష్ చేసి అబ్బురపరిచింది.

80 Year Old Woman Race : బామ్మా.. నువ్వు సూపరహె.. 80ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్న వృద్ధురాలు.. 100 మీటర్ల రేస్ 49సెకన్లలోనే పూర్తి

80 Year Old Woman Race : ఈ రోజుల్లో పాతికేళ్లకే ముసలి వాళ్లలా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. కూర్చుంటే నిల్చోలేరు, నిల్చుంటే కూర్చోలేరు. ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోతున్నారు. కొందరు కుర్రాళ్లలో అసలు ఓపికే ఉండటం లేదు. పరుగులు తీయడం సంగతి పక్కన పెడితే.. చురుకుగా కదలడం కూడా కష్టమే. అయితే, ఉత్తరప్రదేశ్‌కి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలిని చూస్తే ఔరా అనాల్సిందే. పండు ముసలి వయసులోనూ లేడి పిల్లలా పరుగు పందాల్లో పాల్గొని తన సత్తా చాటుకుంది. మీరట్‌లో జరిగిన ఓ రన్నింగ్ రేస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మీరట్‌లో 100 మీటర్ల పరుగు పందాలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులతో పాటు 80ఏళ్ల వృద్ధురాలు చీర కట్టుకొని రన్నింగ్ ట్రాక్‌ షూ వేసుకుని పాల్గొంది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. వృద్ధురాలు పరిగెత్తుతుందా లేక పడిపోతుందా అని అంతా అనుమానంగా చూశారు. కానీ రన్నింగ్ రేస్ నిర్వాహకులు విజిల్ వేయగానే ట్రాక్‌లోనే రేసు గుర్రంలా పరుగులు పెట్టింది వృద్ధురాలు. 100 మీటర్ల రేసును కేవలం 49సెకన్లలో పూర్తి చేసి అందర్నీ విస్తుపోయేలా చేసింది.

Also Read : Two Month old Baby singing : పాట పాడిన రెండు నెలల పసిబిడ్డ..! వావ్ అంటున్న నెటిజన్లు

80ఏళ్ల వయసులోనూ ఈ బామ్మ.. తగ్గేదేలే అంటూ పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటడం విశేషం. మీరట్ కు చెందిన బిరీ దేవి.. 49 సెకన్లలోనే 100 మీటర్ల రేస్ ని ఫినిష్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. బామ్మ ఫిట్ నెస్ కు, ఉరకలెత్తే ఉత్సాహానికి అంతా ఫిదా అవుతున్నారు. బామ్మా.. నువ్వు సూపరహే..అని పొగొడుతున్నారు. మీరట్ లో ని ఓ స్కూల్ లో నిర్వహించిన మాస్టర్స్ డిస్ట్రిక్ అథ్లెట్ మీట్ లో బిరీ దేవి పాల్గొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జీవితం చరమాంకంలో ఉన్న వృద్ధురాలు ఎంతో చలాకీగా పరుగు పందెంలో పాల్గొనడమే కాకుండా 100 మీటర్ల రేసును దిగ్విజయంగా పూర్తి చేయడంతో అక్కడున్న వాళ్లతో పాటు నిర్వాహకులు చప్పట్లు కొట్టి మరీ అభినందించారు. 80ఏళ్ల వృద్ధురాలు రన్నింగ్‌ రేసులో పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బామ్మ ఎనర్జీ లెవెల్స్ కు అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. నీ హెల్త్ సీక్రెట్ ఏంటో మాకూ చెప్పవా బామ్మా.. అని అడుగుతున్నారు.