దీదీపై దాడి : వీల్ చైర్ లో వచ్చి మరీ ప్రచారం చేస్తా: మమతా

దీదీపై దాడి : వీల్ చైర్ లో వచ్చి మరీ  ప్రచారం చేస్తా: మమతా

Mamata bone injury campaign in wheelchair : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కాకపుట్టిస్తున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలేకాదు..ఏకంగా దాడులే జరుగుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ వద్ద తీవ్రమైన గాయాలయ్యాయి. ఎడమ భుజం, మెడ వద్ద కూడా గాయాలు కావటంతో ఆమె చికిత్స పొందుతున్నారు.

దీంతో దీదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి లేదనే వార్తలు వస్తున్నాయి. దీనిపై దీదీ క్లారిటీ ఇచ్చారు. వీల్ చైర్ లో కూర్చుని మరీ ఎన్నికల ప్రచారం చేస్తానంటూ తనదైన స్టైల్లో చెప్పారు మమతా బెనర్జీ. కోల్‌కతాలో ఆస్పత్రి బెడ్‌పై సీఎం మమతా బెనర్జీ పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన మమతా తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేయటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగుతోంది. మమతపై దాడి వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తల నిరసన చేపట్టటంతో కార్యకర్తలంతా సంయవనం పాటించాలని దీదీ పిలుపునిచ్చారు. తనపై జరిగిన దాడికి ఈసీయే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

దీదీపై దాడి వార్తతో పశ్చిమబెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ శ్రేణులు బుధవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఇది దాడి కాదు ప్రమాదం మాత్రమేనని..చిన్నపాటి ప్రమాదాన్నే పెద్దది చేసి టీఎంసీ నానా హడావిడి చేస్తోందని ప్రత్యర్థి పార్టీ బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. మరోవైపు, కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ సంయమనం పాటించాలని గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వీల్‌చెయిర్‌లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు.

తనపై దాడి చేశారన్న మమత ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై నందిగ్రామ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మమత ఆరోగ్యం స్థిరంగా ఉందని, రక్తంలో సోడియం స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నాయని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు తెలిపారు. గాయమైన ఎడమ కాలికి కట్టు కట్టామని తెలిపారు. దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ వద్ద తీవ్రమైన గాయాలయ్యాయనీ..ఎడమ భుజం, మెడ వద్ద కూడా గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఎవ్వరూ ఆందోపడవద్దని సూచించారు. తన కాలికి అయిన గాయంతో కాలు చాలా నొప్పి ఉందని అయినా వీల్ చైర్లో ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. మమతా బెనర్జీపై జరిగిన దాడిని టీఎంసీ హత్యాయతంగా భావిస్తోంది. దీనికి ఎన్నికల సంఘమే బాధ్యత తీసుకోవాలని టీఎంసీ డిమాండ్‌ చేసింది. సీఎంకు స్థాయికి తగినట్లుగా భద్రత కల్పించలేదని ఆరోపించింది.