Taapsee Pannu: ఏంటి నిజమా.. పెళ్లి చేసుకోబోతున్న తాప్సీ?

టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతున్న క్రేజీ హీరోయిన్ తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్..

Taapsee Pannu: ఏంటి నిజమా.. పెళ్లి చేసుకోబోతున్న తాప్సీ?

Taapsee Pannu

Taapsee Pannu: టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతున్న క్రేజీ హీరోయిన్ తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో ‘ఝుమ్మందినాదం’ సినిమాతో పరిచయమైన తాప్సీ పన్ను.. ప్రభాస్ సరసన మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కూడా నటించింది. ఇంకా వీర లాంటి సినిమాలు చేసినా అవేమీ ఇక్కడ తాప్సీ కి ఉపయోగపడలేదు. దీంతో ముంబైలో బిజీగా మారింది తాప్సి.

Taapsee Pannu: పెద్ద స్టార్ కుటుంబంలో పుడితే.. ఆర్యన్ అరెస్ట్‌పై తాప్సీ

కొంత కాలంగా తాప్సీకీ హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో తాప్సీ స్టార్ హీరోయిన్. అంతేకాదు బ్యానర్ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తూనే నటిస్తున్న తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని బీటౌన్ వర్గాలలో గుసగుసలు మొదలవడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ వార్తలవుతున్నాయి. ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థలో బ్లర్ అనే సినిమా చేస్తున్న తాప్సీ సమంతతో ఓ హిందీ సినిమాను చేయబోతోంది.

Taapsee Pannu: భార్య‌పై భర్త రేప్ కేసు తీర్పు.. తాప్సి రియాక్షన్ ఇదే!

కాగా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయిన మాథియాస్ బోతో థేప్సి తాప్సీ చాలాకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. తన సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో ఈ సొట్టబుగ్గల సుందరికి పరిచయమవగా.. అది కాస్త ప్రేమగా మారింది. గ్యాప్ దొరికితే షికార్లు చేస్తున్న ఈ జంట పెళ్ళికి ఇరు కుటుంబాల వారు పెళ్లి చేయాలని నిర్ణయించుకోగా.. ఇప్పటికే పెళ్లి తేదీ కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్‌గా తాప్సీ పెళ్లికి సంబంధించిన శుభవార్త అనౌన్స్ చేయనున్నారంటున్నారు.