Rajamouli: జక్కన్న.. అలాంటి సినిమా చేసేనా..?
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే, కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా.....

When Will Rajamouli Do Female Oriented Movie
Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే, కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించడంతో ఈ మూవీ కలెక్షన్ల పరంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Rajamouli: రాజమౌళికి దాసోహమంటున్న నాన్ స్టాప్ హిట్స్.. రీజనేంటి?
కాగా ఈ సినిమా తరువాత జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్టును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తానని జక్కన్న ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి కెరీర్ మొత్తం చూసుకుంటే, ఆయన తెరకెక్కించిన చిత్రాలు పక్క కమర్షియల్ అంశాలను కలిగి ఉంటాయి. యాక్షన్, మాస్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్నీ కవర్ చేస్తూ వస్తున్న రాజమౌళి ఒక్క అంశాన్ని మాత్రం టచ్ చేయలేకపోయాడు.
రాజమౌళి ఏంటీ.. ఒక అంశాన్ని టచ్ చేయలేకపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా.. అయితే జక్కన్న తన సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్లను కూడా చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా బాహుబలి చిత్రంలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ పాత్రలను మనం చూసుకోవచ్చు. కానీ జక్కన్న ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను టచ్ చేయకపోవడం సినీ ప్రేమికులను విస్మయానికి గురిచేస్తోంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకునే ఈ డైరెక్టర్, ఎందుకని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఇప్పటివరకు టచ్ చేయలేదని పలువురు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
Rajamouli: మహేష్‌తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ మూవీ..?
అయితే సరైన కథ తనకు ఇంతవరకు రాలేదని.. ఒకవేళ అన్నీ కుదిరితే ఖచ్చితంగా తాను లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు కూడా సిద్ధమని జక్కన్న పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చాడు. కానీ ఇప్పటివరకు రాజమౌళి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాను చూడలేకపోయిన ఆడియెన్స్, మున్ముందు అయినా జక్కన్న నుండి అలాంటి సినిమాను చూస్తామా లేదా అని సందేహిస్తున్నారు. మరి జక్కన్న నిజంగా అలాంటి సినిమా చేసేనా.. అనేది కాలమే చెబుతుంది.