Rajamouli: మహేష్‌తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ మూవీ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

Rajamouli: మహేష్‌తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ మూవీ..?

Rajamouli Mahesh Babu Movie To Be Of James Bond Type

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక రిలీజ్ రోజున ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. కాగా అదే జోరు ఇంకా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ పూర్తి సంతోషంగా ఉన్నారు. అయితే జక్కన్న ఆర్ఆర్ఆర్ తరువాత తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నాడని ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Rajamouli: రాజమౌళికి దాసోహమంటున్న నాన్ స్టాప్ హిట్స్.. రీజనేంటి?

కాగా మహేష్ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఇది అడవి బ్యాక్‌డ్రాప్‌తో రాబోతున్న కథగా ఆయన తెలిపారు. కాగా గతంలో రాజమౌళి మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. దీంతో ఇప్పుడు నిజంగానే హాలీవుడ్ రేంజ్ మూవీని మహేష్ కోసం రెడీ చేస్తున్నాడా అనే సందేహం అందరిలో నెలకొంది. అడవి బ్యాక్‌డ్రాప్‌లో జేమ్స్ బాండ్ సినిమాను జక్కన్న రెడీ చేస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

అంతేగాక ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నారట చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉండబోతుందని, ఈ సినిమాను ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాను నిజంగానే జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా జక్కన్న తెరకెక్కిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.