RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ..?

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియాతో సినిమా ప్రేక్షకులు.....

RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ..?

Where Is Vijayendra Prasad In Rrr Promotions

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియాతో సినిమా ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అప్పుడే ఎగబడి టికెట్లు బుకింగ్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ కూడా అంతే స్థాయిలో ప్రమోషన్స్‌తో రచ్చ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నాన్-స్టాప్‌‌గా తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ ప్రమోషన్స్‌లో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పునాది వేసిన వ్యక్తి ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమాకు కథను అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించకపోవడంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అసలు కారణమైన వ్యక్తి ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్న ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొంది.

RRR: ఎన్టీఆర్, చరణ్‌తో అమీర్ నాటు స్టెప్పు

సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు చిత్ర యూనిట్‌కు ఎదురవుతున్నాయి కూడా. అయితే అసలు విషయం ఏమిటంటే.. విజయేంద్ర ప్రసాద్ ఇటీవల కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆయన సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ ఉన్నా ఆర్ఆర్ఆర్ చిత్రానికి తన సపోర్ట్ ఉంటుందని, ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన కోరుకుంటున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయేంద్ర ప్రసాద్ పూర్తి ఆరోగ్యంగా త్వరగా తిరిగి రావాలని కోరుతున్నారు. ఇక మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో తొలిరోజున ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.