మీకు వంట వచ్చా ? కనిమొళికి విలేకరి ప్రశ్న, మగవాళ్లను ఎందుకు అడగరు, నాన్నకు చేపల కూర వండినా

మీకు వంట వచ్చా ? కనిమొళికి విలేకరి ప్రశ్న, మగవాళ్లను ఎందుకు అడగరు, నాన్నకు చేపల కూర వండినా

Kanimozhi : మీకు వంట వచ్చా ? అంటూ..డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ జాతీయ ఛానెల్ కు సంబంధించిన విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆమె జవాబు ఇచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా చానెల్ కు చెందిన ఓ రిపోర్టర్ కనిమొళిని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయాలు, ఇతరత్రా విషయాలపై ప్రశ్నలు అడిగిన ఆ విలేకరి..మీకు ఎంపీ కదా..? వంట చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. దీంతో కనిమొళి చిరునవ్వు చిందిస్తూ..ఇదే ప్రశ్నను మీరు మగ రాజకీయ నేతలను ఎందుకు అడగరు అంటూ ప్రశ్నించారు.

మీరు ఎంపీగా ఉన్నారు..లోక్ సభలో డీఎంకే ఉపసభా పక్ష నేతగా ఉన్నారు కదా..అంటూ మరోసారి అడిగారు విలేకరి. నాన్న గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారని, అప్పుడు ఈ ప్రశ్న ఆయన్ను ఎందుకు అడగలేదరంటూ చురకలు వేశారు. చివరకు వంట గురించి జవాబు ఇచ్చారు. తనకు వంట చేయడం వచ్చని తెలిపారు. నాన్న గారికి చేపల కూర అంటే బాగా ఇష్టం కదా..మరి ఎప్పుడైనా ఆయన కోసం అది వండారా ? అంటూ అడిగారు. తన తండ్రి కరుణా నిధి కోసం గతంలో చేపల కూర వండినట్లు, ఆయన మెచ్చుకున్నారని..అయితే.. అమ్మ వండిన కూరనే నాన్న బాగా ఇష్ట పడుతారని కనిమొళి చెప్పుకొచ్చారు.

కూతురిని కాబట్టే..తాను చేసిన కూరను కూడా ఆయన కాదనలేకపోయారని, తండ్రులందరూ కుమార్తెల వంటను ఇష్ట పడుతారని ఎంపీ కనిమొళి తెలిపారు. Darkmatter | DLM ఒకరు దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పితృస్వామ్య వ్యవస్థ మీద అడిగిన ప్రశ్నకు కనిమొళి మంచి సమాధానం ఇచ్చారని, పెరియార్ చదవండి, అంబేద్కర్ చదవండి అంటూ ట్వీట్ లో తెలిపారు. దీనిప నెటిజన్లు స్పందిస్తూ..తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.