Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

వచ్చే ఏడాది మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాల్ని మాఫీ చేస్తాం.

Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి యాభై వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడ మండలం కాపుగళ్లులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ‘‘వచ్చే ఏడాది మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాల్ని మాఫీ చేస్తాం.

Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన

ఇది రైతు బంధుకంటే గొప్ప పథకం. భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేసేందుకోసం ఒక పథకం తీసుకొస్తాం. దీని ద్వారా ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. అభయహస్తం పింఛన్లను కూడా తిరిగి ప్రారంభిస్తాం. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయి. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. లాటరీ ద్వారా దళిత బంధు ఎంపిక చేయాలి’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.