Dogs’ Attack In Hyderabad: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం.. దాడిపై కేటీఆర్ స్పందన

హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి ఆర్థిక సాయం అందనుంది. ఆ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రకటించారు. బాలుడి కుటుంబాన్ని బాజిరెడ్డి కుమారుడు, ధర్పల్లి జడ్పీటీసీ జగన్ పరామర్శించారు. ఆ బాలుడి తండ్రి పేరు గంగాధర్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రం వారి స్వస్థలం. 

Dogs’ Attack In Hyderabad: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం.. దాడిపై కేటీఆర్ స్పందన

Dogs' Attack In Hyderabad

Updated On : February 21, 2023 / 7:58 PM IST

Dogs’ Attack In Hyderabad: హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి ఆర్థిక సాయం అందనుంది. ఆ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రకటించారు. బాలుడి కుటుంబాన్ని బాజిరెడ్డి కుమారుడు, ధర్పల్లి జడ్పీటీసీ జగన్ పరామర్శించారు.

ఆ బాలుడి తండ్రి పేరు గంగాధర్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రం వారి స్వస్థలం. నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. అంబర్ పేటలో గంగాధర్ వాచ్ మన్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలుడి కుటుంబానికి నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, కుక్కల దాడిలో బాలుడు మృతి చెందటం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు.

బాధిత కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, వీధి కుక్కల నియంత్రణ చేపడతామని అన్నారు. కాగా, బాలుడిని కుక్కలు అతి దారుణంగా పీక్కుతిన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నా చాలా కాలంగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.

Dogs Attack Boy Died : హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి