New Power Bill : విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి…రాష్ట్రాలపై ఒత్తిడి వద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము కోరడం జరుగుతోందని, తాము మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేమని సీఎం కేసీఆర్ అన్నారు.

New Power Bill : విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి…రాష్ట్రాలపై ఒత్తిడి వద్దు

Cm Kcr Current

Electricity Bill Is Also Withdrawn CM KCR : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము కోరడం జరుగుతోందని, తాము మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేమని సీఎం కేసీఆర్ అన్నారు. నూతన కరెంటు చట్టం తీసుకొచ్చి రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం తగదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ నిర్ణయాలను అమలు చేసుకోవాలని సూచించారు. కానీ..అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదన్నారు. 2021, నవంబర్ 20వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్స్ వినిపించారాయన. కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.

Read More : CM KCR Demands : సహనాన్ని పరీక్షించొద్దు..నీటి వాటాలు తేల్చేయాలి, లేకపోతే ఇక పోరాటాలే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంటు ఇస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ..కేంద్ర ప్రభుత్వం మాత్రం..విద్యుత్ చట్టం తీసుకొచ్చి మీటర్లు బిగించాలంటూ..రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తుందని..ఇది పనికి రాదని చెప్పారు. వెంటనే విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, అమలు అయితే..మరో ఉద్యమం స్టార్ట్ అవుతుందని ఆయన హెచ్చరించారు. మీటర్లు పెట్టాలని అనడం దుర్మార్గ చర్యగా ఆయన అభివర్ణించారు. చట్టాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని, దీనిపై పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. బిల్లు పాస్ కాకుండా…లోక్ సభ, రాజ్యసభలో కూడా పోరాడుతామన్నారు సీఎం కేసీఆర్.