Yash: 200 రోజులుగా ఖాళీగానే ఉన్న రాఖీ భాయ్.. నెక్ట్స్ ఏంటి..?

కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా యశ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. కేజీయఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయ్యి ఇప్పటికే 200 రోజులకు పైగా అయ్యింది. కానీ, యశ్ మాత్రం తన నెక్ట్స్ మూవీని ఇంకా ఎవరితో చేస్తాడా అనే విషయాన్ని కన్ఫం చేయకపోవడంతో అభిమానులు తీవ్రనిరాశకు లోనవుతున్నారు.

Yash: 200 రోజులుగా ఖాళీగానే ఉన్న రాఖీ భాయ్.. నెక్ట్స్ ఏంటి..?

Yash Not Yet Started Any Movie Since 200 Days

Yash: కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక యాక్షన్‌ను ఇలా కూడా ప్రెజెంట్ చేస్తారా అని ప్రేక్షకులు నోరెళ్లబెట్టేలా చేసింది కేజీయఫ్ 2 సినిమా. ఈ సినిమాలో రాఖీ భాయ్ పాత్రలో యశ్‌ను ఎలివేట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Yash : సౌత్ సినిమాలు చూసి ఎగతాళి చేసేవాళ్ళు.. రాజమౌళి బాహుబలి తర్వాతే.. యష్ సంచలన వ్యాఖ్యలు..

ఇలాంటి అంశాలతో వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయ్యి ఇప్పటికే 200 రోజులకు పైగా అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా యశ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. కానీ, ఈ సినిమా తరువాత యశ్ ఎవరితో సినిమా చేస్తాడు.. ఆయన నెక్ట్స్ మూవీ ఎలా ఉండబోతుంది.. ఆయన ఎలాంటి కథను ఓకే చేస్తాడు.. అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం మాత్రం దొరకలేదు. యశ్ కేజీయఫ్ తెచ్చిన సక్సెస్, స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అందుకే తనకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ కథ కోసం ఆయన ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Yash: కేజిఎఫ్-3 గురించి మాట్లడిన యష్.. సినిమా ఎప్పుడు ఉండబోతుంది?

అయితే, యశ్ సినిమా రిలీజ్ అయ్యి 200కు పైగా రోజులు కావడం.. ఇంకా తన నెక్ట్స్ మూవీని కన్ఫం చేయకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మంచి సబ్జెక్ట్ రాగానే వెంటనే ఓకే చేసి సినిమాను స్టార్ట్ చేస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు. మరి 200 రోజులు దాటినా యశ్ ఇంకా తన నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేయకపోవడంతో, ఆయన తన నెక్ట్స్ మూవీని ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.