Yash: కేజిఎఫ్-3 గురించి మాట్లడిన యష్.. సినిమా ఎప్పుడు ఉండబోతుంది?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ "కేజిఎఫ్". ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ సినిమా సిరీస్ కి కొనసాగింపుగా చాప్టర్-3 కోసం దర్శకుడు నీల్ రెండో భాగంలో కొంచెం లీడ్ ఇస్తూ ముగించాడు. దీంతో ఆడియన్స్ మూడోభాగం ఎప్పుడు ఉండబోతుందని దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో హీరో యష్ పాల్గొన్నగా.. కేజిఎఫ్-3 ఎప్పుడు ఉండబోతుందని విలేకర్లు ప్రశ్నించారు. యష్ బదులిస్తూ..

Yash: కేజిఎఫ్-3 గురించి మాట్లడిన యష్.. సినిమా ఎప్పుడు ఉండబోతుంది?

Yash Reveals When did KGF Chapter 3 Happens

Yash: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ “కేజిఎఫ్”. 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజిఫ్ చాప్టర్-1 సినిమా ఇండియా లెవెల్ లో అఖండమైన విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ కట్టిపడేసాడు. ఇక రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది అనే చెప్పాలి.

Hero Yash: ఆచితూచి అడుగేస్తున్న యష్.. ప్రభాస్ నుండి రాఖీ భాయ్ గుణపాఠం!

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్-2 దేశవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియా మొత్తం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. కాగా ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ సినిమా సిరీస్ కి కొనసాగింపుగా చాప్టర్-3 కోసం దర్శకుడు నీల్ రెండో భాగంలో కొంచెం లీడ్ ఇస్తూ ముగించాడు. దీంతో ఆడియన్స్ మూడోభాగం ఎప్పుడు ఉండబోతుందని దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ విషయంపై మేకర్స్ ఎటువంటి నిర్ధారనికి రాకపోవడంతో, చాప్టర్-3 పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో హీరో యష్ పాల్గొన్నగా.. కేజిఎఫ్-3 ఎప్పుడు ఉండబోతుందని విలేకర్లు ప్రశ్నించారు. యష్ బదులిస్తూ.. “ఇప్పటిలో చాప్టర్-3 తెరకెక్కించే ఆలోచన లేదు. కాబట్టి దాని గురించి వచ్చే వార్తలు నమ్మకండి. ఒకవేళ దానికి సంబంధించిన ఏమైనా న్యూస్ ఉంటె నేనే స్వయంగా చెబుతాను” అంటూ వెల్లడించాడు. దీంతో కేజిఎఫ్-3 ఇప్పటిలో ఉండబోదు అని తెలిసి కేజిఫ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.