కొత్త రకం వైరస్‌ చిన్నారుల్లో వేగంగా సోకొచ్చు.. సైంటిస్టుల హెచ్చరిక

కొత్త రకం వైరస్‌ చిన్నారుల్లో వేగంగా సోకొచ్చు.. సైంటిస్టుల హెచ్చరిక

New Variant could more Easily infect Children : కరోనా కొత్త రకం వైరస్ చిన్నారుల్లో తొందరగా సోకే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు.. ‘VUI-202012/01’ పేరుతో కరోనా వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తోంది. లండన్ సహా ఆగ్నేయ ఇంగ్లండ్‌లో కొత్త రకం వైరస్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగిపోయాయని హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాన్ కాక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా క్రిస్మస్ వీకెండ్ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. టైర్-4 కింద మిలియన్ల మందిపై క్రిస్మస్ వేడుకలపై అత్యవసర లాక్ డౌన్‌ విధించారు.

యూకేలో వైరస్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో యూకే నుంచి ఇతర దేశాలకు వెళ్లే డజన్ల కొద్ది విమాన సర్వీసులపై ప్రభావం పడింది. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్ చిన్న పిల్లల్లో ఎక్కువగా సోకే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ తెలిపారు. డేటాలో ఏమైనా నమోదవుతాయో లేదో చూడాలన్నారు. నాన్ వేరియంట్ వైరస్ ల కంటే ఈ కొత్త రకం వైరస్ ఎక్కువగా 15ఏళ్ల లోపు చిన్నారుల్లో సోకే అవకాశం ఉందని చెప్పారు.

దీనికి సంబంధించి ఐదు లేదా ఆరు వారాల వ్యవధిలో రెండు కేసులు నమోదు అయినట్టు గుర్తించామన్నారు. ఈ వైరస్ పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుందనడానికి ఎక్కువ డేటా అవసరం ఉందని అన్నారు. పిల్లలపై కొత్త రకం వైరస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో పరిశోధనలు చేయాల్సిన ఉందని ప్రొఫెసర్ వెండీ బార్ క్లే తెలిపారు. కేవలం చిన్నారులపైనే ఈ వైరస్ దాడి చేస్తుందని అనలేమని చెప్పారు. ఇప్పటివరకూ SARS-CoV-2 వైరస్ పెద్దవాళ్ల కంటే.. చిన్నారుల్లోనే చాలా తక్కువగా ఉందని, ఇతర అంటువ్యాధుల కాదని బార్ క్లే పేర్కొన్నారు.

ఈ కొత్త రకం వైరస్ సులభంగా కణాల్లోకి ప్రవేశించగలదని, తద్వారా చిన్నారుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా మట్టి మైదానాల్లో ఆడుకునే పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. పెద్దవారిలా ఇప్పుడు చిన్నారులు కూడా వైరస్ సమానంగా వ్యాపించవచ్చునని అన్నారు. కొత్తగా మ్యూటేషన్ అయిన ఈ స్ట్రయిన్ 50శాతానికి పైగా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించగలదని, గత కరోనా వైరస్ కంటే అత్యంత ప్రాణాంతకమైనది కావొచ్చునని ప్రొఫెసర్ ఫెర్గ్యూసన్ హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.