COVID-19 New Symptoms : టెస్టుల్లో అంతుచిక్కని వైరస్.. కరోనా కొత్త లక్షణాలు ఇవే!

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ కరోనావైరస్ నిర్ధారణ కావడం లేదు.

COVID-19 New Symptoms : టెస్టుల్లో అంతుచిక్కని  వైరస్.. కరోనా కొత్త లక్షణాలు ఇవే!

Covid 19 New Symptoms

COVID-19 New Symptoms : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ కరోనావైరస్ నిర్ధారణ కావడం లేదు. కరోనా టెస్టులకు కూడా అంతుపట్టనంతంగా మహమ్మారిగా రూపుదాల్చింది. దేశంలో గత 24గంటల్లో రోజువారీ కరోనా ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

చాలావరకూ కేసుల్లో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది. కరోనా మ్యుటేట్ వేరియంట్లు టెస్టుల్లో కూడా నిర్ధారణ కాకపోవడం, అంతుపట్టని కొత్త లక్షణాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త లక్షణాల్లో ఎక్కువగా కనిపిస్తున్న కేసుల్లో ఇవే ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1. గొంతునొప్పి :
గొంతులోనొప్పిగా ఉందా? దురదగా అనిపిస్తోందా? ఏదైనా గొంతువాపుతో బాధపడుతున్నారా? అయితే అది కరోనా లక్షణం కావొచ్చు. కరోనా ఇన్ఫెక్షన్లలో ప్రధాన లక్షణం.. గొంతునొప్పి.. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్షణం 52శాతం కేసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

2. తీవ్ర అలసట :
చాలామంది కరోనా బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్న లక్షణం.. తీవ్ర అలసట.. బలహీనంగా అనిపించడం కరోనా లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎక్కువ మంది కరోనా బాధితుల్లో కరోనా పాజిటివ్ తేలడానికి ముందు వారిలో తీవ్ర అలసట, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలే కనిపించాయని యూకే నిపుణులు చెబుతున్నారు.

3. కండరాల నొప్పులు :
కరోనా సోకిన చాలా మంది బాధితుల్లో ఎక్కువగా ఒళ్లు నొప్పులు.. కండరాల నొప్పులు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. myalgia కారణంగా శరీరంలోని కండరాలు తీవ్ర నొప్పి ఉంటుంది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కండరాల్లోని ఫైబర్ పై దాడి చేస్తుంది. ఫలితంగా శరీరంలోని కండరాల్లో కణజాలం తీవ్ర ప్రభావానికి గురవుతుంది.

4. జ్వరం, చలి :
అసాధారణ జలుబుతో పాటు తీవ్ర చలితో బాధపడుతున్నారా? అయితే కరోనా లక్షణం కావొచ్చు. జ్వరంతో పాటు చలి కూడా తీవ్రంగా ఉండటం మ్యుటేట్ వైరస్ కేసుల్లో సాధారణ లక్షణంగా చెప్పవచ్చు.

5. వికారం, వాంతులు :
వికారంగా అనిపించడం, వాంతులు వంటి లక్షణాలు కూడా కరోనా వైరస్ లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ప్రారంభంలో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

6. తల తిరగడం :
చాలామంది కరోనా బాధితుల్లో ఎక్కువగా న్యూరాలాజికల్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో తల తిరగడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్లలలో కళ్లు తిరగడం, తల తిప్పడం, తీవ్ర అలసట, ఆయాసం, వికారం వంటి లక్షణాలు ఉంటున్నాయి.

7. లాలాజలం ఉత్పత్తి కాకపోవడం :
సాధారణంగా ప్రతిఒక్కరి నోట్లో చెడు బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించేందుకు లాలాజలం ఉత్పత్తి అవుతుంటుంది. కరోనా సోకిన వారిలో ఈ లాలాజల గ్రంథుల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా లాలాజలం ఉత్పత్తి నిలిచిపోతుంది. దీని కారణంగా చాలామంది కరోనా బాధితుల్లో నమలడం కష్టంగా మారుతోంది. ఆహారాన్ని తినలేరు.. సరిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుంది.