Coronavirus : డెల్టాతో చిన్నారులకు తీవ్ర ముప్పు.. డాక్టర్ ఫౌసీ హెచ్చరిక!

ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. డెల్టా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో దాదాపు 117 దేశాల్లో డెల్టా విజృంభిస్తోందని ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో మరింత మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ఫౌసీ హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Coronavirus : డెల్టాతో చిన్నారులకు తీవ్ర ముప్పు.. డాక్టర్ ఫౌసీ హెచ్చరిక!

More Children With Coronavirus

Infect More children with coronavirus : ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. డెల్టా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో దాదాపు 117 దేశాల్లో డెల్టా విజృంభిస్తోందని ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో కరోనా కారణంగా పిల్లల్లో మరింత మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని డాక్ట‌ర్ ఆంథోని ఫౌసీ హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ రెట్టింపు స్థాయిలో వేగంగా వ్యాప్తి చెందగలదని హెచ్చరించారు.

డెల్టా వేరియంట్ పిల్లల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందా? లేదా అనేదానిపై స్పష్టత లేదని ఫౌసీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి పెద్దల్లో మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, టీకా లేని పిల్లలను కరోనా నుంచి రక్షించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. అందుకే వ్యాధి నియంత్రణతో పాటు తల్లిదండ్రులు కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని ఫాసీ సూచించారు. పిల్లలలో లాంగ్ కోవిడ్ పై CDC అధ్యయనం చేస్తోంది. పెద్దవారిలో మాదిరిగా కరోనా లక్షణాలు పిల్లలలో ఎక్కువగా కనిపించవని డేటా సూచిస్తోంది. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని అంటున్నారు.

మరోవైపు.. డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరగడంతో అమెరికాలో క‌రోనా ప‌రిస్థితి మరింత దిగ‌జారేలా కనిపిస్తోందని డాక్ట‌ర్ ఆంథోని ఫౌసీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికీ 10 కోట్ల మంది అర్హులైన అమెరిక‌న్లు వ్యాక్సిన్లు వేయించుకోలేద‌ని ఆయన అన్నారు. టీకా తీసుకోనివారిలో వైర‌స్ వ్యాప్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఫౌసీ తెలిపారు. మ‌హ‌మ్మారి వ్యాప్తితో రాబోయే రోజుల్లో చిన్నారుల్లో కేసులతో పాటు అమెరికన్లు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చ‌రించారు. టీకాతోనే ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ చాలామంది ముందుకురావడం లేదని ఫౌసీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. డెల్టా వేరియంట్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగినా అమెరికాలో తిరిగి లాక్‌డౌన్లు అమలు చేస్తాయని తాను అనుకోవ‌డం లేదన్నారు. అమెరికా దేశ జ‌నాభాలో దాదాపు స‌గం జ‌నాభాకు కొవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ పూర్త‌యినట్టు సీడీసీ నివేదిక వెల్లడించింది.