ఇన్ని హాలిడేస్ ఏం చేసుకోవాలి : వారానికి 4 రోజులే పని

మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారా?. అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 28, 2019 / 08:37 AM IST
ఇన్ని హాలిడేస్ ఏం చేసుకోవాలి : వారానికి 4 రోజులే పని

మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారా?. అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి.

వారంలో 6 రోజులు ఆఫీసుల్లోనే. ఒకే ఒకరోజు, లేదంటే రెండు రోజులు వీక్ ఆఫ్. దొరక్క దొరక్క వారంలో వీక్ ఆఫ్ దొరికితే చాలు.. ఎక్కడెక్కడికి వెళ్లాలో క్షణాల్లో పెద్ద చిట్టా సిద్ధమైపోతుంది. ఎక్కడికి వెళ్దాం.. అబ్బా.. షాపింగ్ కు వెళ్దామా? సినిమాకు వెళ్దామా? అంటూ ఫ్యామిలీతో కలిసి తెగ చర్చిస్తారు. కుటుంబంతో సరదాగా గడపాలని ఇలా ఎన్నో ఊహించుకుంటారు. కానీ వీకాఫ్ తీసుకున్న ఆ రోజుంతా పని ఒత్తిడి నుంచి బయటపడటానికే సరిపోతుంది. దీంతో క్షణాల్లో ఆ రోజులు గడిచిపోతాయి. పని ఒత్తిడి ఒకవైపు.. ఫ్యామిలీతో కలిసి సరదగా గడిపేందుకు కూడా సమయం దొరకదు. ఐటీ ఉద్యోగులకు అయితే మాత్రం వారానికి రెండు రోజులు వీక్ ఆఫ్.. మిగతా ఐదు రోజులు బండెడు చాకిరితోనే ఆఫీసుల్లో గడిపేస్తారు. మళ్లీ వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూడటం వెరీ కామన్. తెల్లారితే మళ్లీ ఆఫీసు.. ఉరకలు, పరుగుల జీవితం. అబ్బా ఏం లైఫ్ రా బాబూ.. మళ్లీ ఆఫీసుకు వెళ్లాలా? మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారు. ప్రతి ఉద్యోగికి ఎదురయ్యే అనుభవమే ఇది. అలాంటి వాళ్లలో మీరూ ఉన్నారా? అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి. 

హాలిడేస్ పై దావోస్ లో బిగ్ డిబెట్..
ఆఫీసుల్లో నాలుగు రోజులే పనిదినాలు ఉండాలనేదానిపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఓ బిగ్ డిబెట్ జరిగింది. ఈ టాపిక్ పై దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా నిలిచింది. ఈ టాపిక్ పై చర్చించేందుకు పలువురు సైకాలిజిస్టులు, ఆర్థిక వేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సదస్సులో 4 రోజుల వ‌ర్కింగ్ డే సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు ఉండటం వల్ల కలిగే బెనిఫిట్స్ పై చర్చించారు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు పనిదినాలు, పని వేళలు తగ్గడం వల్ల వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని ప్రముఖ సైకాలజిస్ట్‌ ఆడమ్‌ గ్రాంట్‌ అభిప్రాయపడ్డారు. పనిదినాలు, పని వేళలు తగ్గడం వల్ల ఉద్యోగి రీఫ్రెష్ అవుతారని అన్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, బ్రెగ్‌మెన్‌ కూడా దీన్ని స్వాగతించారు. తక్కువ పని ఒత్తిడి వల్ల ఉద్యోగి మరింత సంతృప్తిగా పనిచేస్తాడని పలు అధ్యయనాల్లో కూడా రుజువైందంటూ చర్చించారు. ఈ చర్చకు సపోర్ట్ చేస్తూ సంస్థలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలి ఉంది. 

విదేశాల్లో వచ్చేసింది.. భారత్ లో ఎప్పుడో? 
ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో ఈ విధానాన్ని చాలా కంపెనీలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాయి. ఫలితాలు కూడా బాగానే ఉన్నాయని అంటున్నాయి. అమెరికా, బ్రిటన్‌తో సహా 8 దేశాల్లోని మూడు వేలమంది ఉద్యోగులపై జరిపిన అధ్యయనంలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుందని, అలసట తగ్గిపోతుందని పరిశీలనలో తేలిందని చెప్తున్నాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని ప్లేనియో కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ షుల్జ్-హాఫెన్ తెలిపారు. ఆయన తన కంపెనీలో 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. వారానికి కేవలం నాలుగు రోజులు పనిదినాలు కావడంతో.. ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారట. తక్కువ సమయంలోనే ఎక్కువ పనిచేసి.. ఎక్కువ ఫలితాన్ని చూపిస్తున్నారని సర్వేలో తేలింది. మరి ఈ విధానం భారత్ లో ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 

ఇంటి కంటే ఆఫీసే బెస్ట్ .. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
మరోవైపు.. ఆఫీసుల్లో వారానికి 4 రోజులు వీక్ ఆఫ్ అనే విధానంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఆఫీసుల్లో వారానికి 4 రోజులు సెలవులు ఇస్తే.. పనిచేసేది ఎక్కడ… ఏం చేసుకోవాలి ఇన్ని సెలవులు.. లేదంటే.. జీతాలు పెంచమను. కొన్ని గంటలు ఎక్కువ చేయమన్న చేస్తారు. ఇంట్లో ఉండి ఏం చేయాలి. బయటకెళ్తే డబ్బులు బొక్కా.. కనీసం ఆఫీసున్న కాస్త మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదే ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో వాళ్ల పోరు.. మేం పడలేం బాబోయ్.. అక్కడికి, ఇక్కడికి తీసుకెళ్లమని ఒకటే గోల చేస్తారు. సెలవులిస్తే.. ఇంట్లో తిని తొంగొటమేగా.. చేసేది.. ఏముంటుంది.. శుభ్రంగా ఆఫీసుకెళ్తే ఏ గోలా ఉండదు. ఇంటి కంటే ఆఫీసే బెస్ట్.. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.