Gingivities : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే!

అలాగే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం , రాత్రి భోజనం తరువాత దంతాలను బ్రష్ చేసుకోవటం వల్ల చిగుళ్ల వాపు రాకుండా చూసుకోవచ్చు. పళ్ల సందుల్లో ఇరుక్కునే పదార్ధాలను ఎప్పటికప్పుడు తొలగించు కోవాలి.

Gingivities : చిగుళ్ల వాపు సమస్య వేధిస్తుంటే!

Gingivitis

Gingivities : దంత సంరక్షణ లేకపోవడం, కఠినమైన బ్రెష్‌లను ఉపయోగించటం, చల్లటి పానియాలను అధికంగా తీసుకోవడం, చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం వంటి వివిధ రకాల కారణాల వల్ల చిగుళ్ల వాపు సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల పంటి చిగుళ్ల నుండి రక్తస్రావం కావటం, చిగుళ్లు ఎరుపెక్కి వాపు రావటం, నోటి నుండి దర్వాసన వెదజల్లటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి గురి చేస్తుంది. పంటి చిగుళ్లపై పాచి పేరుకుపోవటం వల్ల అందులో బాక్టీరియా కారణంగా చిగుర్ల వాపు వస్తుంది. చిగుళ్ళ వాపును ఎలా తగ్గించుకోవాలో అర్థంగాక తెగ సతమతం అయిపోతుంటారు. నోటి శుభ్రత పాటించని వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ధూమపానం, పోషకాహార లోపం, ఒత్తిడి, మధుమేహం, హెచ్ ఐవి, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందులు కూడా ఈ సమస్యకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

కొన్నిచిట్కాలతో ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి. దీని నుండి జ్యూస్‌ను తీయాలి. ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి జ్యూస్‌, వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల మీ రెగ్యులర్ టూత్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్‌ పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిగుళ్ళకు, దంతాలకు అప్లై చేసి సున్నితంగా బ్రష్‌ తో తోముకోవాలి. ఆపై గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం , రాత్రి భోజనం తరువాత దంతాలను బ్రష్ చేసుకోవటం వల్ల చిగుళ్ల వాపు రాకుండా చూసుకోవచ్చు. పళ్ల సందుల్లో ఇరుక్కునే పదార్ధాలను ఎప్పటికప్పుడు తొలగించు కోవాలి. ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. చిగుళ్ళ వాపుకు లవంగం నూనె కూడా అద్భుతంగా సహాయపడుతుంది . నూనెను వాపున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించుకోవచ్చు.

నిమ్మరసాన్ని బాయిల్ చేసి నీటిలో వేసి ఆ నీటితో నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి. ఈనీటితో ప్రతి రోజూ చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. అల్లం పేస్ట్ చేసి కొద్దిగా ఉప్పు చేర్చి ఈ పేస్ట్ ను చిగుళ్ళ వాపు మీద అప్లై చేయాలి . ఇది నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆవు నెయ్యిలో కొంచెం పసుపు కాస్త ఉప్పు కలిపి చిగుళ్లపై మసాజ్ చేయడం వల్ల పంటి నొప్పి సమస్యలు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి.