Breakfast : ఆఫీసు ఉద్యోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారం అవసరమే!

సీజనల్ పండ్లు, పెరుగుతో కలిపిన ఓట్స్ కూడా ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపకరిస్తాయి. వీలైనంత వరకు చిప్స్, బయటి ఆహారం తీసుకోవడం మానుకోవటం మంచిది.

Breakfast : ఆఫీసు ఉద్యోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారం అవసరమే!

Smart Snacks

Breakfast : కోవిడ్ నేపధ్యంలో సుదీర్ఘ విరామం తరువాత కార్యాలయాలు తిరిగి తెరవడంతో, ఉద్యోగులు ఇప్పుడు క్రమంగా సాధారణ దినచర్యకు తిరిగి వస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రోజువారీ ఆఫీసు కార్యాకలాపాల కోసం మెదడు ,శరీరాన్ని సిద్ధం చేయడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు రోజులో అల్పాహారం అనేది కీలకమైన అంశాలలో ఒకటి. పనివేళల్లో సైతం ఏదోఒకటి తినాలన్నకోరిక ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో కలిసి ఉన్నప్పుడు లేదా ఒత్తిడిని తగ్గించడానికి అనారోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకుంటుంటారు చాలా మంది. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చిరుతిండిని చాలా మంది ఇష్టపడుతుంటారు.

అలాంటి వారు కార్యాలయానికి చేరుకున్న తర్వాత తాజా నిమ్మ రసం, కొబ్బరి నీరు , ఓట్స్ బనానా షేక్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవాలి. కెఫీన్ కలిగివుండే టీ,కాఫీ ని వీలైనంత వరకు తగ్గించటం మంచిది. ఒక నిర్ణీత సమయంలో మధ్యాహ్నం భోజనం చేయండం మంచిది. వీలైతే ఇతర సహోధ్యోగులతో కలిసి తినడం మానుకోవటం మంచిది. ఎందుకంటే వారితో మాటలతో ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మీ లంచ్ బాక్స్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పనీర్ పారంతా ,వెజిటబుల్ పారంతా, వెజిటబుల్  పోహా లేదా ఉప్మా, గుడ్డు తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో దోసకాయలో కొంత భాగంతోపాటు, పెరుగు తీసుకోండి. ఇవి వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

సీజనల్ పండ్లు, పెరుగుతో కలిపిన ఓట్స్ కూడా ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపకరిస్తాయి. వీలైనంత వరకు చిప్స్, బయటి ఆహారం తీసుకోవడం మానుకోవటం మంచిది. పని దినాలలో బిజీగా గడిపిన తర్వాత, సాయంత్రం పూట ఒక గ్లాసు తాజా పండ్ల రసం,ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుందని కోల్‌కతాకు చెందిన పోషకాహార నిపుణుడు సోహినీ సీల్ షా అన్నారు. ముఖ్యంగా ఆఫీసులో, మీ శరీరానికి శక్తి , అవసరమైన పోషకాలను అందించడానికి ఆరోగ్యకరమైన, సమయానుకూలమైన అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్న వారికి ప్రస్తుతం అది సాధ్యకాకపోవచ్చు. అయితే బయటి నుండి వచ్చే ఆహారాన్ని తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మహమ్మారి సమయంలో చాలా మంది ఇంటి ఆహారం తీసుకోవటం వంటి మంచి అలవాటును అలవర్చుకున్నారు. అదే అలవాటును కొనసాగింపుగా మధ్యాహ్నం అల్పాహారంగా పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో సబ్జీ, రోటీ ,దహీ వంటి ఆమారాలను తీసుకోవాలి. దానితో పాటు గ్రీన్ సలాడ్, సాయంత్రం సమయంలో గింజలు వంటివి తీసుకోవాలి. ఏదిఏమైనా నిర్దిష్ట సమయంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది.