“గర్భిణీ స్త్రీ” కోసం….యూపీ యూనివర్శిటీలో కొత్త కోర్సు

  • Published By: venkaiahnaidu ,Published On : February 23, 2020 / 09:53 AM IST
“గర్భిణీ స్త్రీ” కోసం….యూపీ యూనివర్శిటీలో కొత్త కోర్సు

మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి,ఆమెను ఆమె ఎలా ఫిట్ గా ఉంచుకోవాలని,ఏవిధమైన మ్యూజిక్ ఆమెకు మంచిగా ఉంటుంది అనే విషయాలను బోధిస్తారు.

దేశంలోనే మొదటిసారిగా ఇప్పుడు లక్నో యూనివర్శిటీ ఈ కోర్సును ప్రారంభించింది. “గర్భ్ సంస్కార్” పేరుతో ఈ సర్టిఫికెట్ అండ్ డిప్లొమా కోర్సును లక్నో యూవర్శిటీ తీసుకొచ్చింది. ఉద్యోగాల కల్పనకు కూడా ఈ కోర్సు ఓ మీడియం అని యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మగ విద్యార్థులు కూడా ఈ గర్భ్ సంస్కార్ కోర్సుని ఎంచుకోవచ్చని యూనివర్శిటీ తెలిపింది.

ఈ కోర్సుకి సంబంధించి ఓ గైడ్ లైన్ సిద్ధం చేయడం జరుగుతుందని,దాని ద్వారా విద్యార్ధులు 16విలువలను నేర్చుకుంటారని లక్నో యూనివర్శిటీ ప్రతినిధి దుర్గేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కోర్సు ప్రధానంగా గర్భంతో ఉన్న మహిళలు తీసుకోవలసిన ఫ్యామిలీ ప్లానింగ్,న్యూట్రిషన్ విలువలును గురించి చెబుతోందని శ్రీవాత్సవ తెలిపారు.

తల్లులుగా వారు నిర్వహించబోయే పాత్ర కోసం అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడానికి పాలన యంత్రాంగం ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్(రాష్ట్ర యూనివర్శిటీలకు ఛాన్సలర్ కూడా) ప్రతిపాదన తీసుకొచ్చిన అనంతరం ఈ కోర్సు ప్రస్ఫుటం చేస్తుందని దుర్గేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కోర్సుని లక్నో యూనివర్శిటీ విద్యార్థులు,గైనకాలజిస్టులు స్వాగతించారని ఆయన తెలిపారు.

గతేడాది లక్నో యూనివర్శిటీలో జరిగిన కాన్వకేషన్ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్….మహాభారతంలోని అభిమన్యుడిని ఉదాహరణగా చెబుతూ..తల్లి కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు యుద్ధ నైపుణ్యాలను పొందాడని అన్నారు. జర్మనీలోని ఓ యూనివర్శిటీ ఇలాంటి ఓ కోర్సుని ప్రవేశపెట్టిందని ఆ సందర్భంలో ఆమె తెలిపారు.

గర్భ్ సంస్కార్ కోర్సు చాలా బాగుందని,తాము స్వాగతిస్తున్నామని,ఇది చాలా సున్నితమైన ఇష్యూ అని,మాతృత్వం గురించి విద్యార్థులు ట్రైనింగ్ చేయబడితే…అది దంపతులకు ఆరోగ్యకరమైన బిడ్డను కలిగి ఉండేందుకు సహాయం చేయబడుతుందని… దాని అర్థం మన దేశానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అని సంజీవ్ అనే ఓ మగ విద్యార్థి తెలిపాడు. 

మహిళలు మరియు చిన్నారుల సంక్షేమ ప్రోగ్రామ్ ను ఈ కోర్సు సపోర్ట్ చేస్తుందని సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మధు గుప్తా తెలిపారు. మన దేశానికి గొప్ప సంస్కృతి, విలువలు ఉన్నాయని ఆమె తెలిపారు. స్త్రీ యొక్క భావోద్వేగాలు మరియు ఆలోచనలు ఆమె పూర్వ భావన మరియు భావన రెండింటిలోనూ ఆమె బిడ్డపై ప్రతిబింబిస్తాయి. గర్భధారణ సమయంలో మహిళల కార్యకలాపాలు, ఆహారం మరియు మానసిక శాంతిని చూసుకోవలసిన అవసరం ఉందని ఆమె తెలిపారు.