Rose : గులాబీలో ఔషగుణాలు తెలిస్తే… వదిలిపెట్టరు

గులాబీ పువ్వులో రెక్కలన్నీ రాలిపోయిన తరువాత మిగిలిపోయిన బొండు భాగాన్ని రోజ్ హిప్స్ అంటారు. వీటిల్లో విటమిన్-సి అత్యధిక మొత్తాల్లో ఉంటుంది.

Rose : గులాబీలో ఔషగుణాలు తెలిస్తే… వదిలిపెట్టరు

Rose Flower (1)

Rose : సువాసన కలిగిన అందమైన పువ్వులలో గులబీ ముఖ్యమైనది. రోసాజాతికి చెందిన గులాబీలో 300పైగా రకాలు ఉన్నాయి. ప్రేమకు చిహ్నంగా గులబీని సూచిస్తారు. పూజకు వీటిని వినియోగిస్తారు. అంతేకాదు గులాబీలలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వివిధ రకాల జబ్బులకు గులాబీని విరివిగా వినియోగిస్తారు.

గులాబీ పువ్వుల నుండి తీసిన నూనె శతాబ్దాలుగా పరిమళ ద్రవ్యాలలో ఉపయోగించబడుతుంది. రోజ్ ఆయిల్ నుండి తయారైన రోజ్ వాటర్, ఆసియా మరియు మధ్యప్రాచ్య వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. గులాబీ రేకుల నుండి తయారైన రోజ్ సిరప్ ఫ్రాన్స్‌లో ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్లో, ఫ్రెంచ్ లో రోజ్ సిరప్ పింక్ స్కోన్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

రోజ్ బెర్రీలను విటమిన్ కంటెంట్ కోసం జామ్, జెల్లీ, మార్మాలాడే మరియు టీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వాటిని చూర్ణం చేసి పింక్ ఫ్రూట్ జ్యూస్‌గా మారుస్తారు. గులాబీ పండ్ల నుండి తయారైన రోజ్ సీడ్ ఆయిల్ చర్మానికి మరియు సౌందర్య సాధనాలకు ఉపయోగిస్తున్నారు.

గులాబీ మొగ్గలు, గులాబీ పూల బౌండ్లు వీటిని రోజ్ హిప్స్ గా పిలుస్తారు. టీ పొడి, మల్లెపూలు అన్నీసమానంగా తీసుకొని కలిపి రెండు టేబుల్ స్పూన్ల పరిమాణంలో తీసుకొని, రెండు కప్పుల నీళ్లలో వేసి పదినిమిషాలు మరిగించి, ఒక టీస్పూన్ తేనె చేర్చి లోపలకు తీసుకుంటే లైంగిక శక్తి బాగా పెంపొందుతుంది. లైంగిక వాంఛలు కలిగేందుకు ఉపకరిస్తుంది.

రోజ్ వాటర్, గ్లిజరిన్ ని ఒక్కో భాగం తీసుకొని, ఒక సీసాలో వేసి బాగా గిలకొడితే చక్కని మాయిశ్చరైజర్ తయారవుతుంది. దీనిని పొడి చర్మానికి రాసుకుంటే చర్మం కుసుమకోమలంగా తయారవుతుంది. వ్యాపారదృక్పథంతో తయారుచేసే మార్కెట్ ఉత్పత్తులకన్నా ఇది ఎన్నో రెట్లు బాగా పనిచేస్తుంది.

రక్తహీనతతో బాధపడుతున్న వారు ఆరు టీస్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీస్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి వడపోసి, రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనతనుంచి బయటపడతారు.

గుండె నొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు ఒక టీస్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీస్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్దనా చేసుకుంటుంటే గుండెనొప్పి వంటి సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది.

కాలిన గాయాలు, దెబ్బలకు రోజ్ వాటర్ ను , ఉల్లిపాయల రసాన్ని కలిపి గాయాలమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానతాయి. తలనొప్పి వంటి సమస్యలకు గులాబీలు 100 గ్రా., ద్రాక్షపండ్లు 100 గ్రా. నీళ్లలో వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలం నుంచి బాధించే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మంగుమచ్చలు, మొటిమలు, చీముగడ్డలు వంటి వాటికి రోజ్ వాటర్లో కుంకుమపువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమకోమలంగా తయారవుతుంది. మంగుమచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి.

గులాబీ పూరెక్కలను, తేనెను, పంచదారను పొరలుగా పరిచి పదిహేను. రోజులవరకూ మాగేస్తే గుల్కంద్ తయారవుతుంది. దీనిని ఎండాకాలం వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి పాలతో కలిపి వాడతారు. అలాగే మహిళల్లో అధిక బహిష్టుస్రావాన్ని తగ్గిస్తుంది. గులాబీపువ్వుల ఆకర్షణ పత్రాలను మొగ్గ దశలోనే వేరుపరిచి నీడలో – అతి కొద్దిసేపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద – ఎండబెట్టి నిల్వచేస్తారు. వీటిని పాన ఖురి అంటారు. శీతలపానీయాల్లో సువాసనకోసం, చల్లదనం కోసం వాడుతారు.

గులాబీ పువ్వులో రెక్కలన్నీ రాలిపోయిన తరువాత మిగిలిపోయిన బొండు భాగాన్ని రోజ్ హిప్స్ అంటారు. వీటిల్లో విటమిన్-సి అత్యధిక మొత్తాల్లో ఉంటుంది. ఆసక్తికరమైన విశేషమేమంటే, ప్రతి 100 గ్రాముల రోజ్ హ్ లోనూ 150 మి.గ్రా. ఆస్కార్బిక్ యాసిడ్ వుంటుంది. విటమిన్-సి నిల్వలుగా పేరుగాంచిన కమలాపండ్ల రసంలో ప్రతి 100 మి.లీ రసానికి విటమిన్-సి 50 మిల్లీగ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం.

తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో కలిపి ఆవిరి వచ్చేంత వరకూ మరిగించి, నీటి ఆవిరిని మరో పాత్రలో సేకరించి చల్లబరుస్తారు. దీనినే రోజ్ వాటర్ అంటారు. ఈ ప్రక్రియను శాస్త్రీయ పరిభాషలో డిస్టిలేషన్ అంటారు. ఈ రోజు వాటర్ గా పిలుస్తారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. కళ్లకలక వంటి పిత్తవికారాలను తగ్గిస్తుంది.