Moscow Strain : రష్యాలో కొత్త స్ట్రెయిన్‌ గుర్తింపు..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతోంది. రకరకాల మ్యుటేషన్లు, స్ట్రెయిన్లతో కొత్తరూపాన్ని మార్చుకుంటోంది. వ్యాక్సిన్లకు ఏ మందుకు లొంగనంతగా ప్రమాదకరంగా మారుతోంది.

Moscow Strain : రష్యాలో కొత్త స్ట్రెయిన్‌ గుర్తింపు..

Moscow Strain New Strain Of Coronavirus Discovered In Moscow By Russian Scientists

Moscow Strain : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతోంది. రకరకాల మ్యుటేషన్లు, స్ట్రెయిన్లతో కొత్తరూపాన్ని మార్చుకుంటోంది. వ్యాక్సిన్లకు ఏ మందుకు లొంగనంతగా ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్, డెల్టా పస్ల్ వంటి అనేక స్ట్రెయిన్లతో బెంబేలిత్తిస్తోన్న కరోనా.. మరోసారి రూపాంతరం చెందింది. రష్యాలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కనుగొన్నారు. రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్‌కు చెందిన సైంటిస్టులు మాస్కో స్ట్రెయిన్‌ను గుర్తించారు.

మాస్కోలో తొలిసారిగా ఈ వైరస్ బయటపడింది.. అందుకే దీన్ని మాస్కో స్ట్రెయిన్‌గా పేరొచ్చింది. రష్యాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు సైంటిస్టులు వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపుతుందో పరిశోధించే పనిలో పడ్డారు సైంటిస్టులు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై రష్యా వ్యాక్సిన్ సమర్థంగానే పని చేస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

ఈ వైరస్ కు సంబంధించి ప్రస్తుతానికి పరిమిత డేటా మాత్రమే ఉందని అంటున్నారు. కాని అధ్యయనం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని గమలేయ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. రష్యాలో కొత్తగా 13,397 కరోనా కేసులు నమోదు కాగా.. 396 మరణాలు నమోదయ్యాయి. ఇందులో కొత్తగా 5,782 కరోనా కేసులు మాస్కోకు చెందినవే ఉన్నాయి. కరోనా వైరస్ ఆందోళనను అరికట్టడానికి మాస్కో మేయర్ Sergey Sobyanin జూన్ 15 నుంచి జూన్ 19 వరకు ‘నాన్ వర్కింగ్ వీక్‌’గా ప్రకటించారు.