Insulin : మోతాదుకు మించి ఇన్సులిన్ ప్రమాదకరమే!…

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు చెందిన ఉల్లాస్ కొల్తూర్ బృందం, ఐఐటీ ముంబైకి చెందిన రంజిత్ బృందం జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్ధ పాడైపోతే రోడ్డు ప్రమాదాలు ఏవిధంగా జరుగుతాయో అదే తరహాలో శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్ధ దెబ్బతింటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Insulin : మోతాదుకు మించి ఇన్సులిన్ ప్రమాదకరమే!…

Sugar

Insulin : శరీరంలో అతిముఖ్యమైన హార్మోన్ లలో ఇన్సులిన్ ఒకటి. ఇది పోలిపెప్టైడ్ ప్రొటీన్ తో తయారైన హార్మోన్. రక్తంలోని చక్కెర స్ధాయిలను సాధారణ స్ధితిలో ఉంచేందుకు ఇన్సులిన్ తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే రక్తప్రవాహంలో రక్త కణాల నుండి గ్లూకోజ్ కణాలను పీల్చుకునేందుకు ఇన్సులిన్ ను క్లోమం విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే ప్యాంక్రియాస్ గ్లూకోజ్ ను విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్ధాయిలను పెంచటానికి ఇన్సులిన్ దోహదపడుతుంది.

రక్తంలో గ్లూకోజ్ నియంత్రించలేని పరిస్ధితినే డయాబెటీస్, షుగర్, మదుమేహం అంటాం. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో  షుగర్ వ్యాధిని నియంత్రించడం సాధ్యమయ్యింది. మధుమేహం 10 ఏళ్ల కంటే మించి ఉన్నా, వయసు 65 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉన్నా, రక్తంలో గ్లూకోజు పరగడుపున 250 కంటే ఎక్కువ, తిన్న తర్వాత రెండు గంటలకు 500 కంటే ఎక్కువ, హెచ్‌బీఏ1సీ 10 కంటే ఎక్కువ, ట్రైగ్లిజరైడ్లు 600 కంటే ఎక్కువ ఉన్నవారు ఇన్సులిన్‌ తీసుకోవటాన్ని మనం చూస్తుంటాం. అయితే ఇటీవలికాలంలో చాలా మందిలో ఇన్సులిన్ వినియోగిస్తున్నారు. అవసరానికి మించి ఉపయోగిస్తున్నారు.

మధుమేహంతో బాధపడుతున్న వారు అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకోవటం ప్రమాదకరమని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నార. దీని వల్ల శరీరంలో కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్ధ దెబ్బతినటంతోపాటు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం చూపుతుందని వారంటున్నారు. అధిక మొత్తంలో ఇన్సులిన్ తీసుకుంటే శరీరంలోని కణజాలం, కిడ్నీలు, కండరాలు, నరాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని గుర్తించారు.

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు చెందిన ఉల్లాస్ కొల్తూర్ బృందం, ఐఐటీ ముంబైకి చెందిన రంజిత్ బృందం జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్ధ పాడైపోతే రోడ్డు ప్రమాదాలు ఏవిధంగా జరుగుతాయో అదే తరహాలో శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్ధ దెబ్బతింటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇన్సులిన్ మోతాదుకు మించి వాడే వారిలో శరీరంలో సంకేతాలు పంపే వ్యవస్ధ దెబ్బతింటుందని కనుగొనటం ఇదే ప్రధమం. ఇలా జరిగితే అలాంటి వారికి మందులు సైతం పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.