యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్లు వచ్చేశాయి.. 99.9 శాతం ప్రొటెక్షన్ గ్యారెంటీ అంటున్న సియారాం

  • Published By: sreehari ,Published On : July 22, 2020 / 07:32 PM IST
యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్లు వచ్చేశాయి.. 99.9 శాతం ప్రొటెక్షన్ గ్యారెంటీ అంటున్న సియారాం

కోవిడ్-19 వైరస్ నుంచి ఇక మాస్క్‌లే కాదు.. వేసుకునే డ్రెస్సింగ్ సూట్లు కూడా ప్రొటెక్ట్ చేయనున్నాయి. యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చేశాయి. టెక్స్ టైల్ ఇండస్ట్రీ నుంచి భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సియారాం అనే టెక్స్ టైల్ కంపెనీ ఈ తరహా సూట్లను డిజైన్ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ కోసం అవసరమైన సూట్లను డిజైన్ చేస్తున్నామంటోంది. వీటికి యాటీ కరోనా ఫాబ్రిక్ సూట్లు అని పేరు పెట్టింది. కరోనా నుంచి 99.9 శాతం ప్రొటెక్షన్ గ్యారెంటీ అంటోంది. ఈ సూట్లు ధరించి బయటకు వెళ్లినా కరోనా ఏం చేయదని.. పూర్తి స్థాయిలో దాదాపు 100 శాతం వైరస్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుందని గట్టిగా చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన టెస్టింగ్ ల్యాబ్‌ల్లో ఈ యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్లను పరీక్షించినట్టు చెబుతోంది.
Siyaram's Launches 'Anti-Corona Fabric,' Claims It Gives 99.9% Protection From COVID-19ప్రాథమిక స్థాయిలో కరోనాతో పోరాడేందుకు వీలుగా ఈ తరహా ఫాబ్రిక్ సూట్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా కంపెనీ హెల్త్ గార్డ్ సహకారంతో ఈ ఫాబ్రిక్ సూట్ ను డిజైన్ చేశామని సియారాం కంపెనీ వెల్లడించింది. 25ఏళ్లుగా హెల్త్ గార్డ్ నాన్-ఇన్వాసివ్ హెల్త్‌కేర్‌లో పనిచేస్తోంది.

కొత్త ఫాబ్రిక్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 99.94 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఇతర మెటల్ ఆధారిత కెమిస్ట్రీ ప్రొడక్టులతో పోల్చితే లీచింగ్ డిజైన్ కలిగి ఉంది. ఈ క్లాత్ లేయర్ నీటిలో కరిగిపోకుండా సాయపడుతుంది. ఫాబ్రిక్ సహజ, స్థిరమైన జీవఅధోకరణ పదార్థాల నుంచి తయారైంది.
Siyaram's Launches 'Anti-Corona Fabric,' Claims It Gives 99.9% Protection From COVID-19

ఫాబ్రిక్ మృదువైన డిజైన్‌తో లీచింగ్ చూస్తే తెలిసిపోతుంది. సియారామ్ సిల్క్ మిల్స్ లిమిటెడ్ సిఎండి రమేష్ పోద్దార్ చెప్పిన ప్రకారం.. మన శరీరంలో 90శాతం క్లాత్‌లతో కవర్ చేసి ఉంటుంది. వైరస్ నుంచి క్లాత్ ఉపరితలంపై ఎక్కువ గంటలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
Siyaram's Launches 'Anti-Corona Fabric,' Claims It Gives 99.9% Protection From COVID-19ఫాబ్రిక్ తయారీలో ఉపయోగించిన ‘కాస్మెటిక్ బేస్డ్ కెమిస్ట్రీ’ లేయర్ పాజిటీవ్ కంపౌడ్స్‌తో డిజైన్ చేశారు. బయటి లిపిడ్ లేయర్‌ను బ్రేక్ చేస్తుందని, కొన్ని సెకన్ల వ్యవధిలో వైరస్‌ను నాశనం చేస్తుందని అంటోంది.. వైరస్ బారిన పడకుండా దీనితో పాటు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. మాస్క్ ధరించడం, శానిటైజ్ చేయడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కంపెనీ సూచిస్తోంది.