OMG : పోర్న్ వీక్షకుల్లో 30శాతం అమ్మాయిలే

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 02:09 PM IST
OMG : పోర్న్ వీక్షకుల్లో 30శాతం అమ్మాయిలే

కామా తురాణాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు.. అందుకేనేమో.. ఎలాంటి బెరుకు లేకుండా మన దేశంలో నీలిచిత్రాల వీక్షణం సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. ఫలితం  మాత్రం కనిపించడం లేదు. పోర్న్‌ సైట్లు పక్కదారుల్లో మరీ నెట్టింట్లోకి అడుగు పెడుతున్నాయి. ఇంకేముంది నిషేధం నీరుగారిపోతోంది.. వీక్షణం యథేచ్ఛగా కొనసాగిపోతోంది.

 

అబ్బాయిలు.. అమ్మాయిలు అనే తేడా లేకుండా పోర్న్‌ వీడియోలు చూసేస్తున్నారు. ప్రభుత్వ నిషేధ ఆంక్షలు ప్రభావం చూపించడం లేదు. నిషేధ ప్రభావం ఉన్న కొద్ది రోజుల పాటు నీలిచిత్రాల  వీక్షణం తగ్గినట్టే కనిపించింది. పోర్న్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు అడ్డదారులు వెదికి మళ్లీ అందుబాటులోకి తీసుకు రావడంతో.. పోర్న్‌కు అలవాటు పడ్డ ప్రాణాలు మళ్లీ చూసేయడం మొదలెట్టాయి.  పోర్న్‌పై నిషేధాంక్షలు ఫలితం ఇవ్వకపోవడానికి కారణాలేంటి? నెట్టింట అసలేం జరుగుతోంది?

 

పోర్న్ వీడియోలు.. దేశంలో ఇప్పుడు బిగ్ ప్రాబ్లమ్‌గా మారాయి. పోర్న్ వీడియోలు చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది. నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని కంట్రోల్  చేయడం ప్రభుత్వం వల్ల కూడా కావడం లేదు. నిన్న మొన్నటి వరకూ మగాళ్లే పోర్న్‌ వీడియోలు ఎక్కువగా చూస్తారేమోననే భ్రమలుండేవి.. చూసేది ఎక్కువ మందే గానీ.. అమ్మాయిలు కూడా ఏ  మాత్రం ఈ విషయంలో తగ్గడం లేదు. పోర్న్‌ చూసే వాళ్లలో 30శాతం మంది మహిళలు కూడా ఉంటున్నారనే ఆశ్చర్యపరిచే నిజాలు ఒక అధ్యయనంలో తేలాయి. అసలు పోర్న్‌ పట్ల ఎందుకు  అంతలా ఆకర్షితులవుతున్నారు? సర్వేలు ఏం చెబుతున్నాయి?

 

సప్త వ్యసనాలను దాటి ఇప్పుడు అష్టమ వ్యసనంగా పోర్న్‌ మారిందా? పోర్న్‌ అధికంగా చూడడం వల్ల శృంగారపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా? నిషేధం విధించడం హక్కులను  కాలరాసినట్టవుతుందా? పోర్న్‌ వీడియోలను అధికంగా చూసేవారి ప్రవర్తన ఎలా ఉంటోంది? దీని పర్యవసనాలేంటి? అసలు సంపూర్ణ నిషేధం సాధ్యమయ్యే పనేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి.

 

* 2019 నెట్టింట్లో కుప్పలు తెప్పలుగా అశ్లీల వెబ్‌సైట్లు
* రోజురోజుకూ విస్తరిస్తున్న పోర్నోగ్రఫీ సైట్లు
* 2018 నవంబర్ 1 నుంచి 827 పోర్న్‌ సైట్ల నిషేధం
* ప్రభుత్వం విధించిన నిషేధపు కట్టు దాటుతున్న నిర్వాహకులు
* ఐపీ అడ్రస్‌లతో సహా నిరోధించిన నెట్‌ ప్రొవైడర్లు
* ప్రపంచ పోర్న్‌ మార్కెట్లో అమెరికాదే అగ్రస్థానం
* రెండో అతి పెద్ద మార్కెట్‌ భారతదేశానిదే
* డొమైన్‌ ఎక్స్‌టెన్షన్ల మార్పులు
* పాత డేటాతోనే కొత్త వెబ్‌సైట్ల సృష్టి
* పెరిగిన పోర్న్‌ వీక్షకుల సంఖ్య
* ప్రభుత్వ నిషేధిత జాబితాలో 59 పాపులర్‌ సైట్లు
* 2015లో కమిటీ వేసిన కేంద్ర సర్కారు
* అప్పట్లోనే నిషేధం విధింపు
* ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర నిరసనలు
* కొద్ది రోజుల్లోనే నిషేధం ఎత్తివేత
* పూర్తిస్థాయి నిషేధం సాధ్యమేనా?
* భారత్‌లో 45కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగం
* పోర్నోగ్రఫీ నిరోధక చట్టం ఏదీ?

* పోర్న్ చూసే దేశాల్లో ఇండియాది మూడో స్థానం
* ఇండియాలో పోర్న్‌ చూస్తున్న వారిలో మహిళలు 30శాతం
* 2018లో పోర్న్ విస్తరణపై ఆసక్తికర విషయాలు
* పోర్న్‌ వీక్షణలో అమెరికాది మొదటి స్థానం
* యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రెండో స్థానం
* నిషేధం ఉన్నా మూడో స్థానంలో భారత్‌
* పోర్న్ చూసే భారతీయుల సగటు వయస్సు 29ఏళ్లు
* ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లలో పోర్న్‌ వీక్షకులు 71.6శాతం
* భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వీక్షకులు 90శాతం
* నిషేధంలో వెబ్ ఫిల్టర్ల కీలకపాత్ర

* 2018 నవంబర్ 1 నుంచి 827 పోర్న్‌ సైట్ల నిషేధం
* ప్రభుత్వం విధించిన నిషేధపు కట్టు దాటుతున్న నిర్వాహకులు
* ఐపీ అడ్రస్‌లతో సహా నిరోధించిన నెట్‌ ప్రొవైడర్లు
* ప్రపంచ పోర్న్‌ మార్కెట్లో అమెరికాదే అగ్రస్థానం
* రెండో అతి పెద్ద మార్కెట్‌ భారతదేశానిదే
 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

Also Read : చదివింది టెన్త్ క్లాసే : ఆల్కహాల్‌ డిటెక్టర్‌‌తో అద్భుతం చేశాడు