Pushpa : ‘పుష్ప’లో ఇవాళ్టి నుంచి ‘ఆ’ సీన్ తీసేస్తున్నారు..

అల్లు అర్జున్, రష్మికల మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశం మరీ అభ్యంతకరంగా ఉంది అంటూ విమర్శలు రావడంతో ఆ సీన్ ని ఇవాళ్టి నుంచి కట్ చేయనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.

Pushpa :  ‘పుష్ప’లో ఇవాళ్టి నుంచి ‘ఆ’ సీన్ తీసేస్తున్నారు..

Rashmika

Pushpa :   బన్నీ – సుక్కు కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా మంచి టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాపై సుక్కు స్పెషల్ మార్క్ కచ్చితంగా ఉందనే అంటున్నారు ప్రేక్షకులు. ఇందులోని సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా తీసారని టాక్ వినిపిస్తుంది. ఇక అల్లు అర్జున్, రష్మికల మధ్య లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఓ రొమాంటిక్ సన్నివేశం మరీ అభ్యంతకరంగా ఉంది అంటూ విమర్శలు రావడంతో ఆ సీన్ ని ఇవాళ్టి నుంచి కట్ చేయనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.

AHA : తొలి తెలుగు ఇండియన్ ఐడల్ ‘ఆహా’లో

పుష్ప‌-శ్రీ‌వ‌ల్లీల మ‌ధ్య సెకండాఫ్‌లో జరిగిన ఓ సీన్ లో అల్లు అర్జున్ తన వ్యాన్‌లో కూర్చొని శ్రీవల్లి భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు. ఆ తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వేసినట్లుగా చూపిస్తారు. ఈ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బందిగా మారినట్లు తెలియడంతో పాటు కొంతమంది మహిళలు ఈ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం సుక్కు దాకా వెళ్లడంతో ఈ సీన్ ని తొలిగించడానికి ఫిక్స్ అయ్యాడట సుకుమార్. ఇవాళ్టి నుంచి థియేటర్స్ లోఈ సీన్ ని తొలిగించి షో వేయనున్నారని తెలిపారు.