Kidnap Drama : సినిమాకోసం తనని తానే కిడ్నాప్.. 30 లక్షలు ఇమ్మని తండ్రికి బెదిరింపు..

యువకుడికి ఇంకా డబ్బులు కావాలని త‌న స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. తనని తానే కిడ్నాప్ చేసుకొని తండ్రికి ఫోన్ చేసి తాను కిడ్నాప్ అయినట్టు నమ్మించి 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌....

Kidnap Drama : సినిమాకోసం తనని తానే కిడ్నాప్.. 30 లక్షలు ఇమ్మని తండ్రికి బెదిరింపు..

Kidnap Drama

Cinema-Kidnap :   తమిళనాడుకి చెందిన ఓ యువకుడు ఎప్పట్నుంచో సినిమాల్లోకి రావాలి అనుకుంటున్నాడు. డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ఏది ఓకే అవ్వకపోవడంతో తనే సొంతంగా ఓ షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నాడు. ఎలాగైనా షార్ట్ ఫిలిం తీయాల‌నుకున్నాడు. ఇందుకోసం త‌న తండ్రిని రూ.30 ల‌క్ష‌లు అడ‌గ్గా ఆయ‌న అంత‌మొత్తం ఇవ్వ‌డం కుదరదన్నారు. ఈ యువకుడు మరీ మరీ అడగడంతో కేవ‌లం రూ.5 ల‌క్ష‌లు ఇచ్చాడు.

 

ఆ యువకుడికి ఇంకా డబ్బులు కావాలని త‌న స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. తనని తానే కిడ్నాప్ చేసుకొని తండ్రికి ఫోన్ చేసి తాను కిడ్నాప్ అయినట్టు నమ్మించి 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌గ‌దు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అది కూడా తెలంగాణ‌కి తీసుకురావాల‌ని, ఈ విష‌యం పోలీసుల‌కు చెబితే చంపేస్తామ‌ని బెదిరించారు.

Pradeep Raj : కరోనాతో ప్రముఖ డైరెక్టర్ మృతి

అయితే ఈ యువకుడి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో ఇదంతా ఫేక్ కిడ్నాప్ డ్రామా అని గుర్తించిన పోలీసులు ఆ యువకుడిని, అతని ఇద్ద‌రు స్నేహితుల‌ని సికింద్రాబాద్‌లోని ఓ హోట‌ల్ లో ప‌ట్టుకున్నారు. విచార‌ణ‌లో పార్ట్ ఫిలిం కోసమే ఇదంతా చేశామ‌ని నేరం అంగీక‌రించ‌డంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.