Aakaasam Nee Haddhu Ra: హిందీలోకి ఆకాశం నీ హద్దురా.. వర్క్ అవుట్ అవుతుందా?

విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో 2020లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు.

Aakaasam Nee Haddhu Ra: హిందీలోకి ఆకాశం నీ హద్దురా.. వర్క్ అవుట్ అవుతుందా?

Aakaasam Nee Haddhu Ra

Aakaasam Nee Haddhu Ra: విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో 2020లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. తమిళంలో సూరరై పొట్రుగా రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో రిలీజ్ చేశారు. దక్షిణాదిలో అతిపెద్ద విజయాన్ని అందుకొన్న ఈ సినిమాపై అప్పుడే బాలీవుడ్ ప్రముఖులు కన్నేశారు.

Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..

ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి ఏడాదిగా చాలా ప్రయత్నాలు జరగగా ఇప్పుడు ఫైనల్ గా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్-రాధిక మదన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను హిందీ రీమేక్ చేయనున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగరనే ఈ రీమేక్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నేడు సోమవారం ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకురాగా ముహూర్తపు సన్నివేశానికి ముందు హీరోయిన్ రాధికా మదన్ కొబ్బరికాయ కొడుతున్న ఓ వీడియోను అక్షయ్ కుమార్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!

అంతేకాదు కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టామని.. దీనికి మంచి టైటిల్ ను సూచించమని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా వచ్చిన సింప్లి ఫ్లై అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడే స్క్రీన్ ప్లేలో తడబాటు ఉందని రివ్యూలు వచ్చాయి. అయితే కథలో కొత్తదనంతో సినిమా హిట్టైంది. సుధా కొంగర ఇంతవరకు దక్షణాది సినిమాలను హ్యాండిల్ చేయగా ఈ రీమేక్ తో తొలిసారి హిందీకి పరిచయం కానుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.