Aamir Khan : ఆమీర్ ఖాన్ రీ ఎంట్రీ షురూ అవ్వబోతుంది.. 3 ఇడియట్స్ సీక్వెల్..?

కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత ఆమీర్ తొలిసారి సినిమాలకు కొంచెం బ్రేక్ ప్రకటించి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. దీంతో ఏడాది నుంచి కనిపించని ఆమీర్ ఇప్పుడు రీ ఎంట్రీకి..

Aamir Khan : ఆమీర్ ఖాన్ రీ ఎంట్రీ షురూ అవ్వబోతుంది.. 3 ఇడియట్స్ సీక్వెల్..?

Aamir Khan next film starts from january 2024 released on CHRISTMAS

Updated On : August 29, 2023 / 5:26 PM IST

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాది అయ్యిపోయింది. చివరిగా ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) సినిమాలో కనిపించాడు. మధ్యలో ‘సలాం వెంకీ’ మూవీలో కనిపించినా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ప్రస్తుతం సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత ఆమీర్.. ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే తొలిసారి. తన తదుపరి సినిమా గురించి ప్రశ్నించినా.. ఇప్పటిలో నటించే ఆలోచన లేదు అంటూ మొన్నటి వరకు చెప్పుకొచ్చాడు.

Rajinikanth: బస్‌ డిపోలో త‌లైవా.. నిజ‌మైన సూప‌ర్ స్టార్ అంటూ..

తాజాగా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని పట్టాలు ఎక్కించడానికి ఆమీర్ సిద్దమయ్యినట్లు సమాచారం. ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ దీనిపై ఒక ట్వీట్ చేశాడు. తన సొంత సినిమా నిర్మాణ సంస్థలో ఆమీర్ కొత్త సినిమా ఉండబోతుందట. ఆల్రెడీ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలయ్యాయి అని సమాచారం. 2024 జనవరి 20 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి కూడా ముహమూర్తం ఫిక్స్ చేశారట. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్టమస్ (CHRISTMAS) కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారట.

Jawan : జవాన్ నుంచి ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్.. షారుఖ్ డాన్స్ అదుర్స్..

ఇక ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది, యాక్టర్స్, టెక్నీషియన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే తెలియజేయనున్నారట. తన తోటి హీరోలు సల్మాన్, షారుఖ్ వరుస సినిమాలను చేస్తుంటే ఆమీర్ ఇలా బ్రేక్ ఇవ్వడం తన ఫ్యాన్స్ ని కొంత నిరాశకు గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ వార్త ఆమీర్ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇది ఇలా ఉంటే, ఇటీవల ‘3 ఇడియట్స్’ (3 Idiots) సీక్వెల్ తెరకెక్కించడానికి రాజ్ కుమార్ హిరానీ కూడా కథని సిద్ధం చేస్తున్నట్లు ఆ మూవీలో నటించిన శర్మన్ జోషి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరి ఆమీర్ రీ ఎంట్రీ ఇస్తూ చేయబోయే సినిమా ఏదో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాలి.