Actress Genelia : మా ఆయన 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడు-జెనీలియా

బొమ్మరిల్లు సినిమాలో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన జెనిలియా బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై వైవాహిక జీవితంలో భర్త పిల్లలతో బిజీగా ఉంది.

Actress Genelia : మా ఆయన 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడు-జెనీలియా

Genelia Riteish Deshmukh

Actress Genelia : బొమ్మరిల్లు సినిమాలో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన జెనిలియా బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై వైవాహిక జీవితంలో భర్త పిల్లలతో బిజీగా ఉంది.   సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాత్రం ఎక్కువగా టచ్‌లో ఉంటోంది.

జెనీలియా తన భర్త రితేష్ తో పెళ్లికి ముందు తుజే మేరీ కసమ్ లాంటి పలు హిట్ చిత్రాలలో నటించింది. అయితే ఈ స‌మయంలోనే వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. 2012 వ సంవత్సరంలో పెద్దల ఆశీర్వచనంతో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఇద్దరు కుమారులు పుట్టగా… మొదటి కొడుకు 2014లో రెండో కొడుకు 2016లో జన్మించాడు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జెనీలియా త‌న భ‌ర్త‌తో పాటు పిల్ల‌ల‌తో చేసే అల్ల‌రికి సంబంధించిన అనేక విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అల‌రిస్తూ ఉంటుంది. ఇటీవలే ఈ జంట ఓ డాన్స్ రియాల్టీ షాదీ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. ఈ డ్యాన్స్ షో లో పోటీదారులు చేసిన స్కిట్లు చూశాక… జెనీలియా మాట్లాడుతూ.. ఇదంతా చూసిన తర్వాత తమ పెళ్లి రోజు గుర్తుకు వచ్చిందని చెప్పారు.

నా భర్త రితేష్ దేశ్‌ముఖ్ మాపెళ్లి రోజున తన పాదాలను ఎనిమిది సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పింది జెనీలియా. దీనికి వెంటనే రితేష్ స్పందిస్తూ… పెళ్లి తర్వాత ఏం చేయాలనేది అక్కడున్న పురోహితుడికి ముందుగానే తెలిసి ఉంటుంది. అందుకే అలా చేయించాడు అని అన్నాడు. దీంతో అక్క‌డ న‌వ్వులు విరబూసాయి.