Tollywood చందమామ : పెళ్లి పీటలెక్కనున్న కాజల్

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 06:48 AM IST
Tollywood చందమామ : పెళ్లి పీటలెక్కనున్న కాజల్

సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. పెళ్లికి ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్‌ డేటింగ్‌లో ఉందని… వారి ప్రేమకి ఇంట్లో వాళ్లు పచ్చజెండా ఊపారని, వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అయితే…  పెళ్లి తర్వాత నిర్మాతగా మారి ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడంతో పాటు తన భర్త వ్యాపారాల్లో భాగస్వామ్యం కావాలనుకుంటోందట కాజల్‌.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. తన నటన, అందచందాలతో అభిమానులను అలరించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం సినిమా రంగంలోకి అడుగు పెట్టారు కాజల్.

ఈమె వివాహంపై పలు పుకార్లు వ్యాపించాయి. ఈమె చెల్లెలు నిషాకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఓ బిడ్డ కూడా. అయితే..కాజల్ మాత్రం పెళ్లి చేసుకోకుండా సినీ రంగంపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం కాజల్ సినిమాలతో బిజీ గానే ఉంది. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య, మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ‘ఇండియన్ – 2’, ‘హే సినామికా’ నటిస్తున్నారు. హిందీలో ‘ముంబాయి సగ’లో కూడా నటిస్తున్నారు. 

Read: హీరోయిన్ కు బెదిరింపులు-నలుగురు అరెస్ట్